Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

If you prove I am ready to go the Jail says Uma madhavareddy

By   /  August 12, 2016  /  Comments Off on If you prove I am ready to go the Jail says Uma madhavareddy

    Print       Email

uma madhavareddyనిరూపిస్తే జైలుకు వెళ్తా

 

InCorpTaxAct
Suvidha

 

 

గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీంతో ఎవ‌రెవ‌రికి సంబంధాలు ఉన్నాయి.. ఎవ‌రు న‌యీంను ప్రోత్స‌హించారు. అనే వాటికి సంబంధించి గ‌త మూడు రోజులుగా పుంకాను పుంకాలుగా పేప‌ర్ల‌లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో రాజ‌కీయ నాయ‌కులు ఒక‌రొక‌రు బ‌య‌ట‌కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చుకుంటున్నారు. కాగా న‌యీంను మాజీ మంత్రి ఉమా మాధ‌వ‌రెడ్డి ప్రోత్స‌హించార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆమె మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. నయీంతో..ఆ గ్యాంగ్ తో తనకెలాంటి సంబంధం లేదని..తప్పు చేసినట్లు నిరూపిస్తే జైలుకు వెళ్ళేందుకు అయినా సిద్ధమని ఆమె ప్రకటించారు. ఈ లీకుల వ్యవహారం వెనక ముఖ్యమంత్రి కెసీఆర్ ఉందని ఆమె ఆరోపించారు. తమకు  రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ..ఎలాంటి వ్యాపారాలు లేవని అన్నారు. ఎప్పటి నుంచో తాను  ఒకే ఫోన్ ను వాడుతున్నానని..ఎవరైనా ఈ కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చని ఉమా మాధవరెడ్డి వ్యాఖ్యానించారు. సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. న‌యీం ముఠాను తామెప్పుడు ప్రోత్స‌హించ‌లేదన్నారు.

కావాల‌నే ప్ర‌భుత్వం తనపై అంబాండాలు మోపుతోందన్నారు.  ఈ కేసులో ఇరికించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంద‌ని, తాను త‌ప్పు చేస్తే జైలుకు వెళ్లేందుకు సిద్దం అని ప్రకటించారు. నక్స‌లైట్ల దాడితో మాద‌వ‌రెడ్డిని కోల్పోయాం అని, ఇప్పుడు మాద‌వ‌రెడ్డి పేరును చెడ‌గొట్టేందుకు ప్ర‌భుత్వం యోచిస్తోంద‌న్నారు.  మ‌హిళ అని చూడ‌కుండా మ‌చ్చ తెచ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. స‌న్నిహితుల‌ను బ‌య‌ట‌ప‌డేసుందుంకు కేసీఆర్ చేస్తున్న కుట్ర‌లివి అని ఆరోపించారు. తాను ఏ విచార‌ణ‌కు అయినా సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →