బాలీవుడ్ నిర్మాతపై కేసు పెట్టనున్న ఇలియానా..?
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్, అర్జున్ రాంపాల్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ‘ఆంఖే’. 2002లో ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు నిర్మాత. ఇందులో అమితాబ్, అర్షద్ వార్సి నటించబోతున్నారు. ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్ర యూనిట్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందులో తమ కొత్త చిత్రం విశేషాలను నిర్మాత గౌరంగ్ దోషి వివరించారు. తమ చిత్రంలో ఇలియానా కూడా నటించనున్నట్లు చెప్పారు. కానీ ఈ సినిమా కోసం ఇలియానాను సంప్రదిస్తే ఆమె నో చెప్పిందట.
అయినప్పటికీ తమ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోందని నిర్మాత చెప్పారు. ఆ సమయంలో ఇలియానా అక్కడ లేదు. ఈ కార్యక్రమంలో ఇలియానాకి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు. తన అనుమతి లేకుండా వీడియోను ఎలా ప్రదర్శిస్తారంటూ ఈ అందాలతార ఫైర్ అయిందట.
దీంతో మూవీ యూనిట్ పై కేసు పెట్టనుందని బాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. ‘ఆంఖే-2’లో అమితాబ్‌తో నటించే అవకాశం వచ్చినందుకు అందరూ విషెస్ చెప్పడంతో ఇలియానాకి ఈ విషయం తెలిసిందట. దీంతో నిర్మాత గౌరంగ్పై చట్టపరమైన చర్యలు తీసుకోనుందని ఇలియానా ప్రతినిధి పేర్కొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.