Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

In PM Modi’s Independence Day Speech, Firm Words Against Pakistan

By   /  August 15, 2016  /  Comments Off on In PM Modi’s Independence Day Speech, Firm Words Against Pakistan

    Print       Email

modi flag hoisting at redfort 1మానవత్వానికి మారుపేరు భారత ప్రజలు: ప్రధాని మోదీ

 

InCorpTaxAct
Suvidha

 

 

70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ దాయాది దేశం పాక్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. భారత దేశ ప్రజలు మానవత్వానికి మారుపేరు అని అన్నారు. దేశ ప్రజలు పలు సందర్భాల్లో తమ మానవత్వాన్ని చాటుకున్నారని పాక్ ప్రభుత్వాన్ని ఉద్ధేశించి అన్నారు.
‘పాక్ లోని పెషావర్ స్కూల్ లో ఉగ్రదాడి జరిగి సమయంలో ఎంతో మంది చిన్నారులు మృతి చెందారు. ఉగ్రదాడిలో అక్కడి విద్యాలయంలో రక్తంపారింది. ఈ ఘటనను చూసి భారత్ లోని ప్రజలు అందరూ చలించిపోయారు. భారత పార్లమెంట్ సహా .. భారత్ లోని ప్రతి విద్యాలయం కన్నీరు కార్చింది. ప్రతి విద్యార్ధి, యువకుడు బాధపడ్డాడు. భారతీయుల మానవత్వం అంటే ఇలా ఉంటుంది. కాని పాక్ మాత్రం ఉగ్రవాదులను ప్రశంసిస్తూ ఉంటుంది. భారత్ లో ఉగ్రదాడులు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతే .. ఆ దేశంలో వేడుక చేసుకుంటారు. అలాంటి వారిని .. అక్కడి ప్రభుత్వాన్ని ఏమనాలి..? ఇదే వారికి మనకు ఉన్న తేడా. దీన్ని ప్రపంచంలోని ఇతర దేశఆలు అర్ధం చేసుకుంటాయి’ అంటూ మోదీ ప్రసంగించారు.

మోదీ తన ప్రసంగం సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజల గురించి కూడా ప్రస్తావించారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు .. నేను కొందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను అంటూ తెలిపారు. బలోచిస్థాన్‌, గిల్గిత్‌, బల్తిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు తనపై ఎంతగానో ప్రేమ కలిగిఉన్నారని అన్నారు. తాను వారి దగ్గర లేకపోయినా.. వారిని కలిసే అవకాశం లేకపోయినా.. అక్కడి ప్రజలు మాత్రం తనపై ప్రేమ, గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. అందుకే వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాని మోదీ అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →