భారత్- ఆస్ట్రేలియా నాలుగవ టెస్ట్ మ్యాచ్.. 300 రన్స్ కు ఆసీస్ ఆలౌట్..
భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. నిర్ణయాత్మక మ్యాచ్ లోని ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆసీసీ బ్యాట్స్ మెన్ 300 రన్స్ కు ఆలౌట్ అయ్యారు. ఈ మ్యాచ్ లో కొత్త స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ (4/68) అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక ఆసీసీ్ జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (111; 173 బంతుల్లో 14×4)సెంచరీ చేశాడు. దీంతో అతను సిరీస్ లో థర్డ్ సెంచరీ చేసినట్లు అయింది.
ఇక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (56; 87 బంతుల్లో 8×4, 1×6) సాధించాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మాథ్యూవేడ్ (57; 125 బంతుల్లో 3×4, 1×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇక కుల్ దీప్ యాదవ్ తన చైనామన్ బౌలింగ్ విన్యాసంతో ఆసీస్ ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు. ఇలా డేవిడ్ వార్నర్, మాక్స్వెల్, హ్యాండ్స్కాంబ్, కమిన్స్ ను పెవిలియన్ కు పంపించాడు. ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు సాధించాడు. అలాగే బౌలర్లు భువనేశ్వర్, అశ్విన్, జడేజా ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.