Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

India beat Sri Lanka by 5 wickets, went to Asia Cup final..

By   /  March 2, 2016  /  Comments Off on India beat Sri Lanka by 5 wickets, went to Asia Cup final..

    Print       Email

team india playersఫైనల్ లోకి దూసుకెళ్ళిన టీమిండియా..!

 

InCorpTaxAct
Suvidha

 

బంగ్లాదేశ్ ను మట్టికరిపించి.. దాయాదిదేశమైన పాక్ ను ఉతికిఆరేసిన టీమిండియా ధాటికి శ్రీలంక కూడా కుప్పకూలింది. ఇప్పటికే పసికూన బంగ్లా చేతిలో ఓడిన లంకేయులు.. అజేయంగా దూసుకెళ్తున్న భారత ఆటగాళ్లకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. దీనికి తోడు భారత బౌలర్లు ఎక్కువ స్కోరు చేసేందుకు లంక జట్టుకు అవకాశం ఇవ్వలేదు. అయితే టీమిండియా మ్యాచ్ ఆరంభంలో, చివరిలో వికెట్లు కోల్పోవడం కాసింత ఆందోళన కలిగించింది. కోహ్లీ – యూవీ తమదైన శైలిలో జట్టును విజయం దిశగా నడిపించారు. టీమిండియా చేతిలో ఓడిపోవడంతో శ్రీలంక జట్టుకు ఫైనల్ కు వెళ్ళేందుకు సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా శ్రీలంకను కూడా గెలవడంతో టీమిండియా హ్యాట్రిక్ కొట్టి.. ఫైనల్ లోకి దూసుకెళ్ళింది.

 

మంగళవారం మిర్పూర్ లో జరిగిన థర్డ్ లీగ్ మ్యాచ్ లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలిఉండగానే చేరుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌ (1), రోహిత శర్మ (15) వికెట్లు కోల్పోయారు. అయితే కోహ్లీ (47 బంతుల్లో 7 ఫోర్లతో 56 నాటౌట్‌) మంచి ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయం కట్టబెట్టాడు. ఇక.. వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35) మెరుపులు మెరిపించాడు.Yuvraj_singh

 

లంక బౌలర్లలో నువాన్‌ కులశేఖర 2 వికెట్లు తీశాడు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 138 పరుగులు చేసింది. కపుగెదెర (30), సిరివర్దన (22) మాత్రమే రాణించారు. కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ (18), దిల్షాన్‌ (18) పరుగులు చేశారు. లాస్ట్ లో తిసార పెరీర (6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 17) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌ చెరో 2 వికెట్లు తీసి లంకేయులను ఎక్కువ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. విరాట్‌ కోహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచాడు. ఈ విజయంతో మొత్తం 6 పాయింట్లతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో యూఏఈతో టీమిండియా తలపడనుంది.
స్కోర్ బోర్డ్ ..

శ్రీలంక: చాందిమల్‌ (సి) ధోనీ (బి) నెహ్రా 4, దిల్షాన్‌ (సి) అశ్విన్‌ (బి) పాండ్యా 18, షెహాన్‌ జయసూర్య (సి) ధోనీ (బి) బుమ్రా 3, కపుగెదెర (సి) పాండ్యా (బి) బుమ్రా 30, మాథ్యూస్‌ (బి) పాండ్యా 18, సిరివర్దన (సి) రైనా (బి) అశ్విన్‌ 22, షనక (రనౌట్‌) 1, తిసార పెరీర (స్టంప్ట్‌) ధోనీ (బి) అశ్విన్‌ 17, కులశేఖర (రనౌట్‌) 13, చమీర (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 138/9, వికెట్ల పతనం: 1-6, 2-15, 3-31, 4-57, 5-100, 6-104, 7-105, 8-125, 9-138. బౌలింగ్‌: నెహ్రా 4-0-23-1, బుమ్రా 4-0-27-2, హార్దిక్‌ పాండ్యా 4-0-26-2, యువరాజ్‌ 1-0-3-0, జడేజా 2-0-19-0, అశ్విన్‌ 4-0-26-2, రైనా 1-0-9-0.
భారత్: ధావన్‌ (సి) చాందిమల్‌ (బి) కులశేఖర 1, రోహిత్ (సి) కపుగెదెర (బి) కులశేఖర 15, కోహ్లీ (నాటౌట్‌) 56, రైనా (సి) కులశేఖర (బి) షనక 25, యువరాజ్‌ (సి) కులశేఖర (బి) పెరీర 35, హార్దిక్‌ పాండ్యా (బి) హెరాత 2, ధోనీ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 1 , మొత్తం: 19.2 ఓవర్లలో 142/5; వికెట్ల పతనం: 1-11, 2-16, 3-70, 4-121, 5-125. బౌలింగ్‌: మాథ్యూస్‌ 3-0-16-0, కులశేఖర 3-0-21-2, తిసార పెరీర 4-0-32-1, చమీర 4-0-27-0, హెరాత 3.2-0-26-1, షనక 1-0-7-1, సిరివర్దన 1-0-13-0.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →