టీమిండియా ప్లాన్..వెస్టిండిస్ ప్లాప్!
వెస్టిండిస్ గడ్డపై భారత ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. దూకుడుతో ఆడడంతో పాటు ప్లాన్ చూసి దెబ్బ కొడుతున్నారు. తాము వేసుకున్న ప్లాన్ పక్కాగా వర్కవుట్ అయిందని భారత పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ అంటున్నారు. వీలైనంత తక్కువ స్కోరుకే వెస్టీండీస్ని కంట్రోల్ చేయాలనుకున్నామని,అందుకు వీలైనన్ని మెయిడిన్ ఓవర్లు వేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 161.5 ఓవర్లలో 8 వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేయగా భారత బౌలర్లు విజృంభించడంతో విండీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 243 ఆలౌట్ చేసి మూడొందలకు పైచిలకు పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్ పై పట్టు బిగించింది.
వెస్టిండీస్‌పై భారత బౌలర్లు ఉమేష్ యాదవ్(4/41)మహ్మద్ షమీ(4/66)తో చెలరేగారు. దీంతో వెస్టిండీస్ 243 పరుగులకే కుప్పకూలింది. కాగా విండీస్‌కి ఫాలోఆన్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా విదేశీ గడ్డపై మనవాళ్లు రాణిస్తుండడం శుభపరిణామమే. ముఖ్యంగా ఇది కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. కోచ్ అనిల్ కుంబ్లే అయితే మరింత ఆనందాన్ని ఇచ్చే అంశమే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.