టిల్టింగ్ రైళ్ల గురించి స్విట్జర్లాండ్ తో భారత్ ఒప్పందం..
టిల్టింగ్ రైళ్లు వరల్డ్ వైడ్ గా 11 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ రైళ్లు ఇటలీ, పోర్చుగల్, సాల్వేనియా, ఫిన్ ల్యాండ్, రష్యా, చెక్ రిపబ్లిక్, యూకే, స్విట్జర్లాండ్, చైనా, జర్మనీ, రొమేనియా వంటి దేశాల్లోనే ఉన్నాయి. ఎలాంటి మలుపులోనైనా వేగంగా వెళ్లడం వీటి ప్రత్యేకత. ఇవి భారత్ లో కూడా పరుగులు పెట్టనున్నాయి. ఈ రైళ్ల కోసం భారత్.. స్విట్జర్లాండ్ తో ఒప్పందం చేసుకుంది.
నిజానికి అతి వేగంగా వెళ్ళే రైళ్లలో టర్నింగ్ ల దగ్గర అందులో ఉన్నవారు పక్కకు ఒరిగిపోతారు. కాని టిల్టింగ్ రైళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. టర్నింగ్ లలో చక్రాలు మాత్రమే ఒంపు తిరుగుతాయి. అందువల్ల పక్కకు ఒరిగిపోవడం అంటూ జరగదు. అంటే బోగీ పక్కకు ఒరిగిపోదన్నమాట.
గత ఏడాది స్విస్ కు చెందిన దౌత్యాధికారి భారత్ కు వచ్చినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు పర్యటన సందర్భంగా ఈ డీల్ కుదుర్చుకున్నారు. ఇవి భారత్ కు వచ్చిన తర్వాత ముందుగా కొంకణ్ రైల్వే కార్పొరేషన్ కు అందించే యోచనలో ఉన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.