నకిలీ నోట్ల నియంత్రణకు కేంద్రం వినూత్న ఆలోచన..
నకిలీ కరెన్సీని అరికట్టేందుకు పెద్ద నోట్లు రూ.2000, రూ.500ల భద్రతా ప్రమాణాలను మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రతి నాలుగేళ్ళకోసారి ఈ మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ మధ్యకాలంలో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు ఇలా ప్రతి నాలుగేళ్ళకోసారి భద్రతా ప్రమాణాలను మారుస్తూ ఉంటాయి. భారత్ కూడా ఈ విధానాన్ని అవలంబించాని యోచిస్తోంది.
రీసెంట్ గా జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర ఆర్థిక, హోం శాఖ సీనియర్ అధికారులు, కేంద్రహోం కార్యదర్శి రాజీవ్ మహర్షీ హాజరయ్యారు. ఈ భేటీలో నోట్ల భద్రతా ప్రమాణాలు మార్చే అంశం గురించి ప్రతిపాదనలు వచ్చాయి. నకిలీ నోట్లను అరికట్టాలంటే ఈ పద్ధతి మేలైనదని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక భారీగా పట్టుబడిన నకిలీ రెండు నోట్లు పాకిస్థాన్ లో ముద్రించినట్లుగా విచారణలో తేలింది. నకిలీ నోట్ల ముద్రణకు ఐఎస్ఐ సాయం చేస్తోంది. వీటిని పాక్ ముద్రించి బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి ప్రవేశపెడుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.