Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

India have great Reliability

By   /  January 21, 2018  /  Comments Off on India have great Reliability

    Print       Email

భారతదేశ విశ్వసనీయత గొప్పది..!

 

InCorpTaxAct
Suvidha

 

 

భారతదేశానికి ఆస్ట్రేలియా గ్రూప్‌తో సహా విశిష్ట అణు బృందాల్లో ప్రవేశం లభించడమే అందుకు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత రెండేళ్ళలో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్, వసినార్ ఎరేంజ్‌మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్‌లలో మన దేశానికి సభ్యత్వం లభించిందన్నారు. మొదట ఎంటీసీఆర్.. ఆ తర్వాత వసెనార్.. తాజాగా ఆస్ట్రేలియా గ్రూప్.. ఇలా వరుసబెట్టి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక మండళ్లలో భారత్ సభ్యత్వం దక్కించుకుంటూ వచ్చింది.

అత్యున్నత అణు మండళ్లలో లభిస్తున్న సభ్యత్వం.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై భారత్‌కు ఉన్న కమిట్‌మెంట్‌ను చెప్పకనే చెబుతోందని ఆయన అన్నారు. రసాయనిక, జీవసంబంధ ఆయుధాల తయారీకి ఉపయోగపడే పదార్థాలు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాలు, ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్ళకుండా ఈ గ్రూప్‌లు నియంత్రిస్తాయి. ఆస్ట్రేలియా గ్రూప్‌లో సభ్యత్వం లభించిన అనంతరం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ దీనివల్ల పరస్పర ప్రయోజనం దక్కుతుందన్నారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధానికి దోహదపడుతుందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →