Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

India is ready to face Bangladesh in T20

By   /  March 8, 2018  /  Comments Off on India is ready to face Bangladesh in T20

    Print       Email

బంగ్లాదేశ్‌తో భార‌త్ ఢీ

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* కీల‌కంగా మారిన రెండ‌వ టి 20 మ్యాచ్‌

* టీమిండియాలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవ‌కాశం

* సాయంత్రం 7 గంటల నుంచి డి స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం

డెక్క‌న్ అబ్రాడ్‌: నిదహాస్‌ టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య గురువారం రెండో మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓడిన టీమిండియా నేడు బంగ్లాదేశ్‌తో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఓపెనర్‌ శిఖర్ ధావ‌న్ ధనాధన్‌ దూకుడు మినహా భారత ఇన్నింగ్స్‌లో మెరుపులు లేకపోవడం కొంపముంచింది. తొలిగా బ్యాటింగ్‌ చేసి 174 పరుగులు చేసినా పవర్‌ప్లేలో ఆతిథ్య జట్టుకు పరుగులు భారీగా సమ ర్పించుకోవడంతో మ్యాచ్‌ చేజారింది. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ డకౌట్‌, రైనా రాణించకపోవడంతో జట్టు ఒత్తిడికి గురైంది. దీంతో బంగ్లాదేశ్‌పై టీమిండియా సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహ్మద్‌ షమీపై వేటు

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వేటు వేసింది. బుధవారం ప్రకటించిన ఒప్పంద ఆటగాళ్ల జాబితా నుంచి షమీ పేరును తొలగించింది. షమీకి దేశంలో ఎంతో మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని, అతనికి తన కంటే ముందే పాకిస్తాన్‌కు చెందిన మహిళతో వివాహం జరిగిందని షమీపై అతని భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపణల నేపథ్యం… షమి వివరణ… షమీకి విడాకులిచ్చే ప్రశ్న లేదంటూ నేడు చేసిన బహి రంగ ఆరోపణ ప్రసార మాధ్యమాల్లో దుమారం రేపాయి. దీంతో ఒప్పంద ఆటగాళ్ల జాబితాలో కొనసాగించడం వల్ల విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించి అతని పేరును ఒప్పంద ఆటగాళ్ల జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →