Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

India through to World T20 semi-final as Kohli brilliance beats Australia

By   /  March 28, 2016  /  Comments Off on India through to World T20 semi-final as Kohli brilliance beats Australia

    Print       Email

www.hdnicewallpapers.com

టీమిండియాతో చేతుల్లో కంగారూలు బౌల్డ్..
కళ్ళముందు భారీ లక్ష్యం. దీనికి తోడు మొదటి మూడు వికెట్లు వరుసగా పడ్డాయి. అంతకుమించి టీమిండియా డేంజర్ లో ఉంది. అవతలి జట్టు చిన్నా చితకా కాదు.. ఆస్ట్రేలియా. అయితే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లా మాత్రం ఎక్కడా తగ్గలేదు. చివరికంటూ నిలబడి భారత్ కు అద్భుత విజయాన్ని అందించాడు. 51 బంతుల్లో 2 భారీ సిక్సర్లు, 9 బౌండరీలు బాది 82 పరుగులు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 161 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా బ్యాట్స్ మెన్ను కట్టడి చేస్తూ 49 పరుగులకే 3 వికెట్లను తీసేసింది.

InCorpTaxAct
Suvidha

రాణించిన యూవీ- కోహ్లీ భాగస్వాయ్యం..

అయితే కోహ్లీ.. యువరాజ్ సింగ్ (21) కలసి 4వ వికెట్ కు 45 పరుగుల భాగ స్వామ్యాన్ని నిర్మించాడు . సింగిల్స్ డబుల్స్ రొటేట్ చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన బంతుల్ని బౌండరీలు పంపిస్తూ మంచి పార్ట్ నర్ షిప్ ని నిర్మించింది.. ఈ జోడీ. 1 సిక్సర్, 1 బౌండరీతో ఊపుమీదున్న యువీ ఫాల్కనర్ వేసిన స్లో బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ ను గాల్లోకి ఆడాడు. అయితే వాట్సన్ సూపర్ క్యాచ్ తో యూవీ పెవిలీయన్ కు చేరాడు. తర్వాత కెప్టెన్ ధోని క్రీజులోకి వచ్చాడు. అప్పుడు జట్టు 14 ఓవర్లలో 94/4 పరుగులతో ఉంది. 6 ఓవర్లలో 67 పరుగులు చేయాల్సి ఉంది. రన్ రేట్ 11 పరుగులపైగానే ఉంది.

ఇరగదీసిన కోహ్లీ- ధోనీ పార్ట్ నర్ షిప్..

కీలక సమయంలో క్విక్ రన్నింగ్, కీ బౌండరీలతో కోహ్లీ, ధోనిల జంట మంచి ఇన్నింగ్స్ ఆడింది. వాట్సన్ వేసిన 15వ ఓవర్లో ధోని ఒక బౌండరీ బాదాడు. 4 సింగిల్స్ తో 8 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో ఆరు బంతుల్ని ఎదుర్కొన్న కోహ్లీ నాలుగు డబుల్స్, ఒక ఫోర్ తో 12 పరుగులు పిండుకున్నాడు. 17 ఓవర్లో ధోని ఒక బౌండరీతో పాటు నాలుగు సింగిల్స్ మాత్రమే రావడంతో 8 పరుగులు మాత్రమే వచ్చాయి.

చెలరేగిన కోహ్లీ ..

చివరి 3 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి ఉంది. 13 రన్ రేట్ ఉండటంతో పాటు.. పిచ్ కూడా బౌలర్లకే సహకరించింది. అయితే ఇలాంటి సమయంలో కోహ్లీ చెలరేగిఆడటం విశేషం. 3 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసిన ఫాల్కనర్ బౌలింగ్ కి వచ్చాడు. ఫస్ట్ బాల్ ని డీప్ బ్యాక్ వార్డ్ స్క్వేర్ లెగ్ లో కోహ్లీ బౌండరీ కొట్టాడు. రెండో బంతి స్క్వేర్ డ్రైవ్ తో మరో ఫోర్.. మూడో బంతిని క్రీజును వదిలి ముందుకు వచ్చి లాంగ్ ఆఫ్ లో సిక్సర్ గా మలిచాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతి ఒక రుగు వచ్చింది. ఆరో బంతికి ధోని డబుల్ కొల్లగొట్టాడు. ఈ ఓవర్ లో 19 పరుగులు పిండుకోవడంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయి. భారత్ 2 ఓవర్లలో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒత్తిడి ఆసీస్ పైకి వెళ్లింది. 19 ఓవర్ మొదటి బంతి కోహ్లీ భారీ షాట్ కు ప్రయత్నించగా డాట్ బాల్ అయ్యింది. స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారింది. ఈ తరుణంలో విరాట్ హ్యాట్రిక్ ఫోర్లతో మ్యాచ్ గతిని మార్చాడు. 2వ బంతిని పాయింట్ లో స్వ్కేర్ డ్రైవ్ ద్వారా ఫోర్ కొల్లగొట్టాడు. 3బంతిని ఫైన్ లెగ్ లో బౌండరీ దొరకబుచ్చుకున్నాడు. 4 బంతికి ఎక్స్ ట్రా కవర్ మీదుగా అద్భుత క్రికెటింగ్ షాట్ తో మరో ఫోర్ కొట్టాడు. 5 బంతి డాట్ కాగా.. ఆరో బంతి విరాట్ క్లాసిక్ కవర్ డ్రైవ్ తో బౌండరీని ముద్దాడింది. ఈ ఓవర్లో కోహ్లీ 16 పరుగులు చేశాడు. ఇక చివరి 6 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా. ధోని 20వ ఓవర్ మొదటి బంతిని విన్నింగ్ షాట్ గా బౌండరీకి తరలించాడు. ఈ మ్యాచ్ హీరో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఏప్రిల్ 2వ తేదీన టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ తో తలపడనుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →