Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

India to build sea bridge, tunnel to connect Sri Lanka

By   /  August 29, 2016  /  Comments Off on India to build sea bridge, tunnel to connect Sri Lanka

    Print       Email

srilanka bridgeశ్రీలంకకు మరో వంతెన..

 

InCorpTaxAct
Suvidha

 

 

త్రేతాయుగంలో లంకకు వెళ్ళేందుకు శ్రీరాముడు వానరసేన సాయంతో సముద్రంలో వారధి నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య వంతెన నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం బడ్జెట్ అంచనాలు కూడా సిద్ధం చేసింది. ఇది రెండు దేశాల పరస్పర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్ట్. అందువల్ల శ్రీలంక ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేపట్టింది. అయితే శ్రీలంక ద్వంద్వ వైఖరి వల్ల ఈ వారధి నిర్మాణం ఆశక్తి రేపుతోంది.

భారత్‌-శ్రీలంక మధ్య వారధి అనేది పురాణాల కాలంలోనే సాధ్యపడినట్లు రామాయణం ద్వారా తెలుస్తోంది. తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు సముద్రంలో అస్పష్టంగా కనిపించేదే ‘రామసేతు’గా చాలామంది భావిస్తుంటారు. డీఎంకే హయాంలో సేతు ప్రాజెక్టు కోసం ‘రామసేతు’లోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అది అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. చివరకు ఆ ప్రాజెక్టు కాస్తా వెనక్కువెళ్ళింది. ‘రామసేతు’ వ్యవహారం ఎలా ఉన్నా.. ప్రజెంట్ ‘హనుమాన్‌ సేతువు’ తెరపైకి వచ్చింది.
భారత్‌-శ్రీలంక మధ్య వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా స్పష్టం చేశారు. ఏకంగా రూ.22 వేల కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సుముఖంగా ఉందని ఆయన ప్రకటించారు. రోడ్డుమార్గం అందుబాటులోకి వస్తే రవాణా ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయని పలువురు భావిస్తున్నారు. భారత్ – శ్రీలంక దేశాల వ్యాపారులకూ ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →