Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

India to move extra troops to Dokalam

By   /  July 11, 2017  /  Comments Off on India to move extra troops to Dokalam

    Print       Email

డోక్లాంకు అదనపు సైనిక బలగాలను తరలించిన భారత్..

 

InCorpTaxAct
Suvidha

 

 

చైనా హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ భారత్ డోక్లాం ప్రాంతానికి మరింత సైనిక బలగాలను పంపించింది.అక్కడ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా నిర్ణయించుకుంది. చుంబీ లోయతో పాటు ఖంబా డీజాంగ్ ప్రాంతాల్లో చైనా అదనపు సైన్యాన్ని మోహరించింది. దీంతో భారత్ కూడా అందనంగా 2,500 మంది సైనికులను ఆ ప్రాంతానికి పంపించింది. లడక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఉన్న 4,057 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖపై డోక్లాం సమీపంలో గతంలో ఎప్పుడూ లేనంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

గత నెల రోజులుగా ఇక్కడ భారత్, చైనా దళాలు మోహరించాయి. దీంతో రెండు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డోక్లాం ప్రాంతంలో రెండు దేశాల స్థానిక కమాండర్లు మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. అయితే వీరి చర్చల్లో ఏ మాత్రం పురోగతి లేదని సమాచారం.ఇక గ్యాంగ్ టాక్ లోని 17వ డివిజన్, కిలింపాంగ్ లోని 27వ డివిజన్, బిన్నాగురిలోని 20వ డివిజన్ సైనిక దళాల్లోని పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయగల విభాగాలను సరిహద్దులకు భారత్ తరలించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలోని 63, 112 బ్రిగేడ్లతో వీరు కలిశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →