Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

India vs West Indies: India beat West Indies

By   /  March 11, 2016  /  Comments Off on India vs West Indies: India beat West Indies

    Print       Email

Kolkata: India's Rohit Sharma being greeted by Suresh Raina after his dismissal during a practice game against West Indies at Eden Garden in Kolkata on Thursday. PTI Photo by Swapan Mahapatra(PTI3_10_2016_000332A)టీ20 వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ లో టీమిండియా విజయం..

 

InCorpTaxAct
Suvidha

సూపర్ విక్టరీస్ తో మంచి ఊపుమీదున్న టీమిండియా.. స్వదేశంలో జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్‌ సన్నాహక మ్యాచ్ ని మంచి విక్టరీతో స్టార్ట్ చేసింది. వెస్టిండీస్‌తో ఈడెన గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి జరిగిన తొలి వామప్‌ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.

రోహిత్ శర్మ (57 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 98 నాటౌట్‌) దూకుడుగా ఆడాడు. దీంతో ధోనీసేన 45 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. మంచి ఆల్‌రౌండర్లతో కూడిన వెస్టండీస్ పై అన్ని రకాలుగా టీమిండియా పైచేయి సాధించింది. నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్‌ 19.2 ఓవర్లలో 140 రన్స్ కే కుప్పకూలింది. క్రిస్‌ గేల్‌ (20) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.ఇక జట్టుకు దూరమై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమితో పాటు జడేజా, హార్దిక్‌ పాండ్యా, పవన నేగి రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. రోహిత్ తో పాటు యువరాజ్‌ సింగ్‌ (20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 31), ధవన (17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 21) రాణించారు. రహానె (7), జడేజా (10), పవన నేగి (8), హార్దిక్‌ పాండ్యా (0) సరిగా క్రీజులో నిలవలేకపోయారు. రైనా (1) నాటౌట్‌గా నిలిచాడు. ఇక విరాట్‌ కోహ్లీతో పాటు కెప్టెన్ ధోనీ బ్యాటింగ్‌కు రాలేదు. విండీస్‌ బౌలర్లలో జెరోమ్‌ టేలర్‌, సులేమాన బెన రెండేసి వికెట్లు తీశారు.

చెలరేగిన రోహిత్ ..

ఈ మ్యాచ్ లో ముందుగా టీమిండియా బ్యాటింగ్‌ చేసింది. ఆసియా కప్‌ ఫైనల్లో ఫామ్‌లోకి వచ్చిన ధవన్, రోహిత్ బాగా బ్యాటింగ్‌ చేశారు. మూడు ఫోర్లు, సిక్సర్‌ బాది జోరు మీదున్న ధవన్ ను ఐదో ఓవర్లో బెన్ బౌల్డ్‌ చేశాడు.అయితే వన్ డౌన్‌లో వచ్చిన రహానె క్రీజులో ఎక్కువసేపు నిలువలేదు. మరోవైపు.. రోహిత్ మాత్రం చెలరేగి ఆడాడు. ఆండ్రీ నర్స్‌ వేసిన 11వ ఓవర్లో వరుసగా 4,6,4 సాధించాడు. తర్వాత రస్సెల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌, ఫోర్‌ కొట్టి 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. యువరాజ్‌ కూడా సామి బౌలింగ్‌లో రెండు బౌండ్రీలు బాదాడు. 16వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్‌ కొట్టిన యువీ అదే ఓవర్‌ చివరి బంతికి అవుట్ అయ్యాడు.

టీమిండియా: రోహిత్ (నాటౌట్‌) 98, ధవన (బి) బెన 21, రహానె (స్టంప్డ్‌) రామ్‌దిన (బి) బెన 7, యువరాజ్‌ (సి) టేలర్‌ (బి) సామి 31, జడేజా (సి) ఆష్లే నర్స్‌ (బి) బ్రాత వైట్‌ 10, నేగి (బి) టేలర్‌ 8, హార్దిక్‌ (సి) రామ్‌దిన (బి) టేలర్‌ 0, రైనా (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 9,
మొత్తం: 20 ఓవర్లలో 185/6; వికెట్ల పతనం: 1-32, 2-56, 3-145, 4-160, 5-179, 6-179. బౌలింగ్‌: రస్సెల్‌ 4-0-35-0, టేలర్‌ 4-0-26-2, బ్రాతవైట్‌ 4-0-30-1, బెన 4-0-30-2, ఆష్లే నర్స్‌ 2-0-27-0, సామి 2-0-29-1.

విండీస్‌: చార్లెస్‌ (సి) ధోనీ (బి) షమి 18, గేల్‌ (బి) బుమ్రా 20, శామ్యూల్స్‌ (బి) జడేజా 17, రామ్‌దిన (సి) షమి (బి) జడేజా 6, డ్వేన బ్రావో (సి) రైనా (బి) నేగి 13, రస్సెల్‌ (సి) రహానె (బి) పాండ్యా 19, బ్రాతవైట్‌ (బి) నేగి 6, సామి (సి) రహానె (బి) పాండ్యా 5, ఆండ్రీ నర్స్‌ (సి) రహానె (బి) షమి 8, హోల్డర్‌ (నాటౌట్‌) 13, బెన (సి) రహానె (బి) హర్భజన 8, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.2 ఓవర్లలో 140 ఆలౌట్‌;
వికెట్ల పతనం: 1-36, 2-40, 3-59, 4-72, 5-78, 6-84, 7-96, 8-106, 9-123. బౌలింగ్‌: అశ్విన 2-0-21-0, హర్భజన్ 1.2-0-12-1, షమి 4-0-30-2, బుమ్రా 2-0-6-1, నేగి 4-0-15-2, జడేజా 4-0-26-2, హార్దిక్‌ 2-0-25-2. 7

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →