డ్రాగా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్
భారత్.. వెస్టిండిస్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వెస్టిండిస్ట్ వాళ్లు బ్యాటింగ్‌లో రాణిస్తే.. భారత్ బౌలర్లు బౌలింగ్‌లో రాణించారు. నాలుగు టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా నిర్వహించిన ఈ వామప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ లెవెన్ బ్యాట్స్‌మన్ షై హోప్ (118 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. దీంతో మ్యాచ్‌కు ఆఖరి రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి విండీస్ 87 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. భారత లెగ్ స్పిన్నర్ అమిత మిశ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మిగతా భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్ తలో వికెట్ తీశారు. మిశ్రా విజృంభణతో.. ఓ దశలో విండీస్ లెవన్ 150 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిశ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి విండీస్ యువ బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బంది పడ్డారు.
షమి, ఉమేష్ కూడా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు. ఈ దశలో హోప్-జోమెల్ వారికన్ (50 నాటౌట్) ఎనిమిదో వికెట్‌కు 104 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అంతకుముందు భారత తొలి ఇన్నింగ్స్‌ను 258/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 14-16 మధ్య ఇదే వేదికపై భారత-విండీ్స లెవన్ జట్ల మధ్య ఆఖరి, రెండో వామప్ మ్యాచ్ జరగనుంది. తర్వాత 21 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.