Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

India win final Test to claim series against Australia

By   /  March 28, 2017  /  Comments Off on India win final Test to claim series against Australia

    Print       Email

team indiaఆసీస్ ను మట్టికరిపించి సీరిస్ కైవసం చేసుకున్న భారత్..

 

InCorpTaxAct
Suvidha

 

 

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సీజన్ ను నెంబర్ వన్ ర్యాంక్ తో ముగించింది. సీరిస్ సాధించాలని కసిగా బరిలో దిగిన భారత్ అనుకున్నది సాధించింది.

మొదటి రోజు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ను టీమిండియా 300 రన్స్ కే అడ్డుకుంది. ఇక కోహ్లీ ప్లేస్ లో వచ్చిన బౌలర్ కుల్ దీప్ యాదవ్ అత్యద్భుతంగా రాణించాడు. భారీ స్కోరు చేయాలని భావించిన కంగారులను బెంబేలెత్తించాడు. దీంతో ఆసీస్ 300 రన్స్ కే ఆలౌట్ అయింది.ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ మొత్తం 332 రన్స్ చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. భారత ఓపెనర్లు రాహుల్‌(60), పుజారా(57), రహానె(46) బాగా ఆడారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 63 పరుగులు చేయడంతో భారత్‌ ఆధిక్యంలోకి వచ్చింది.

ఇక సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ను భారత బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఇందులో భాగంగా ఆ జట్టు ఓపెనర్లును ఉమేశ్ యాదవ్ దెబ్బతీశాడు.అతి తక్కువ టైమ్ లోనే కెప్టెన్‌ స్మిత్‌ ను భువనేశ్వర్‌ అవుట్ చేశాడు. మ్యాక్స్‌వెల్‌ కాస్తంత రాణించినా మిగిలిన బ్యాట్స్ మెన్లు మాత్రం భారత్ ధాటికి నిలబడలేకపోయారు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌ చేరాడు.
ఉమేశ్‌ యాదవ్‌, జడేజా, అశ్విన్‌ తలో మూడు వికెట్లు తీశారు. దీంతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 137 రన్స్ కే ఆలౌట్ అయింది.ఇక 106 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 51పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. అంతేకాకుండా 2-1 తేడాతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని దక్కించుకుంది. అలాగే టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →