వెస్టిండిస్‌కు టీమిండియా
ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సీరీస్ ఆడేందుకు కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు క్రికెట్ జట్టు కరీబియన్ గడ్డపై నిన్న అడుగుపెట్టింది. అక్కడి గాట్విక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఫోటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది.
టీమిండియాకు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనిల్ కుంబ్లే ఎదుర్కొంటున్న తొలి సీరీస్ ఇది కావడంతో అతని శిక్షణకు ఇది తొలి పరీక్షగా మారింది. కోహ్లీ నేతృత్వంలోని జట్టుతో కలిసి కుంబ్లే కూడా వెస్టిండీస్ చేరుకున్నాడు. 29 రోజుల పాటు కొనసాగనున్న సీరీస్‌లో భాగంగా జులై 21న తొలి టెస్టు ఆంటిగ్వాలో ఆరంభమవనుంది. ఈ సూదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆగస్టు 18 నుంచి ఆడనుంది. భారత్ చివరిసారిగా టెస్టు మ్యాచ్‌లు గత ఏడాది నవంబరు-డిసెంబరులో దక్షిణాఫ్రికాతో ఆడింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఎక్కువ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన టీమిండియా తొలి సారి టెస్టు ఫార్మాట్లో క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది. అదీ విదేశీ గడ్డపై సీరీస్ ఉండడంతో విండీస్‌తో జరుగనున్న టెస్టుల్లో ఎలా ఆడుతుందోననే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు వెస్టిండీస్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుండగా… ఇటీవలే కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుంబ్లేకు కూడా ఇది తొలి పర్యటన కావడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.