శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు పూర్తి..
అమెరికాలో జాత్యాహంకార దాడి సందర్భంగా తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య జరిగిన విషయం తెలిసిందే. అతనితో పాటు ఉన్న అలోక్ పై శ్వేతజాతీయుడు కాల్పులు జరిపాడు. అయితే అతను పరుగులుపెట్టి గాయాలతో తప్పించుకున్నాడు. అక్కడే ఉన్న మరో శ్వేతజాతీయుడిపై కూడా కాల్పులు జరిగాయి. ఇవాళ శ్రీనివాస్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఆయన మృతదేహాన్ని ఇంటి నుంచి ప్రత్యేక వాహనంలో మహా ప్రస్థానానికి తరలించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు వచ్చారు. అలాగే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీ యాక్టర్ రాజశేఖర్ దంపతులు శ్రీనివాస్ కు నివాళులర్పించారు. తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.
కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో స్వగృహానికి చేరుకుంది. మృతుడిని చూసి ఆయన బంధువులు, స్నేహితులు విలపించారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు వర్థిని, మధుసూదనరావు కుప్పకూలిపోయారు. శ్రీనివాస్ మృతదేహాంతో పాటు వచ్చిన ఆయన భార్య సునయన కూడా విలపించారు.మంగళవారం ఉదయం నుంచి శ్రీనివాస్‌ను చివరిసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు ఆయన నివాసానికి తరలివచ్చారు. అలాగే పలువురు రాజకీయ నేతలు కూడా శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. తర్వాత అశ్రునయనాల మధ్య శ్రీనివాస్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.