Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Indian govt. asks arms suppliers to be prepared..?

By   /  October 10, 2016  /  Comments Off on Indian govt. asks arms suppliers to be prepared..?

    Print       Email

india-border-army2ఆయుధాలను సిద్ధం చేసే పనిలో భారత్..?

యూరీ అటాక్స్ తర్వాత అటు పాక్ ఇటు భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇదికాస్తా యుద్ధం వరకు దారితీసే అవకాశం ఉందని ప్రపంచం మొత్తం భావించింది. అయితే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కాస్తంత తగ్గినట్లు కనిపిస్తున్నాయి. కాని పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ అంశంపై రెండు దేశాల మధ్య ఇంకా మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి కనిపిస్తోంది. తాము ఏ సమయంలో అయినా సరే ఆయుధాలు అడిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆయుధాల సరఫరాదారులకు చెప్పినట్లు సమాచారం. అంతేగాకుండా మందుగుండును రెడీ చేసి ఉంచాలని కూడా సూచించినట్లు సమాచారం.

InCorpTaxAct
Suvidha

భారత ప్రభుత్వం కొన్ని రోజులుగా ఆయుధ సరఫరా దారుల సామర్ధ్యాన్ని అంచనా వేస్తోంది. అంతేగాకుండా ఆయుధాలు సరఫరా చేసేందుకు రెడీ ఉండాలంటూ ఆదేశాలు జారీచేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఒప్పందాలతో పాటు మరిన్ని ఎక్కువ అడిగితే సరఫరా చేసేవిధంగా ఉండాలని తెలియజేసినట్లు సమాచారం. అతితక్కువ సమయంలో అడిగితే ఎన్ని ఇవ్వగలరు అన్న సమాచారాన్ని రక్షణ శాఖ అధికారులు ఆయుధాల సరఫరాదారులను అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఆర్మీ దగ్గర ఆయుధాల కొరత ఏర్పడకుండా ముందస్తుగా సన్నద్ధం కావడం మంచిదని కేంద్రం భావిస్తోంది. దీంతో ఆయుధ సరఫరాదారులను సంప్రదించినట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →