Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Sardar Patel: “మన ఆణిముత్యాలు – 19.. శ్రీ సర్దార్ వల్లభ్ భాయిపటేల్ ”

By   /  October 30, 2016  /  No Comments

    Print       Email

image3ఒక మనిషి ఎలా జీవించాలో తెలియజెప్పిన నిలువుటద్దమే భారత దేశపు ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయిపటేల్ జీవితం.

జవేరీభాయి,లాడ్ బాయ్ దంపతులకు 1875 అక్టోబర్ 31 న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు.ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా జరిగినా ఉన్నత న్యాయశాస్త్ర చదువులకై ఇంగ్లాండ్  వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహమ్మదాబాద్ లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె – మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆయన భార్య మరణ వార్త అందగా ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్త ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.

InCorpTaxAct
Suvidha

36 ఏళ్ళ వయసులో ఇంగ్లాడ్ వెళ్ళి అక్కడ 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా ఉండేవాడు.

ఇంగ్లాండ్ లో  బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ నేతృత్వంలో  స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు.బార్డోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేసినవాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. భారత రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం నెహ్రూజీ నేతృత్వంలో కేంద్రమంత్రిమండలి హోంశాఖ మంత్రి గా,ఉపప్రధానిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు.

fl29patel_2402579gనెహ్రూ శాంతికాముకతను ప్రక్కకు నెట్టి  అనేక సార్లు సఫలమైనాడు. కేవలం 40 మాసాలే  పదవిలో ఉన్నప్పటికీ  అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న స్వర్గస్తుడైనాడు. మన భారత ప్రభుత్వం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదముతో గౌరవించింది.

 1928లో బ్రిటీష్ ఇండియా  ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, సర్దార్ అనే బిరుదు పొందడం జరిగింది.

నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్ లో మద్యపానం,అంటరానితనం.. కులవిచక్షణలకు వ్యతిరేకంగా పని చేసారు.

1931కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.క్విట్ ఇండియా ,ఉప్పుసత్యాగ్రహం మొదలగు ఉద్యమాలలో కూడ ప్రముఖ పాత్ర వహించాడు.

దేశ స్వాతంత్రం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి.

అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.అద్భుతమైన ఆదర్శవంతమైన వ్యక్తిత్వం,యువతకు చక్కని స్ఫూర్తిదాయకం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →