రాణించిన కోహ్లీ..రాహుల్!
వెస్టిండిస్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లలో మనవాళ్లు బాగా రాణిస్తున్నారు. నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు భారత బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్స్ కూడా రాణించారు. లోకేశ్ రాహుల్ (127 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 64 రిటైర్డ్ అవుట్), కెప్టెన్ విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 4 ఫోర్లతో 51) అర్ధ సెంచరీలతో మెరిశారు. రెండో రోజు సమాచారం అందే సమయానికి.. భారత తొలి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం అజింక్యా రహానె (28 బ్యాటింగ్), సాహా (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టీమిండియా ఇప్పటికే 43 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్ 62.5 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. మిశ్రాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం టీమిండియా తొలి రోజు ఆట చివరకు 93/3 స్కోరు చేసింది. ఓపెనర్లు మురళీ విజయ్ (23), శిఖర్ ధవన్ (9) విఫలమయ్యారు. చటేశ్వర్ పుజారా (28) కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే రెండో రోజు మాత్రం కోహ్లీ-రాహుల్ విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.