చెలరేగిన టీమిండియా.. టీ-20 సీరీస్ 1-1తో సమం..
శ్రీలంకతో తొలి టీ 20లో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ 20 లో శ్రీలంకపై ఘన విజయాన్ని సాధించింది. ముందుగా లంకేయులకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా.. తర్వాత వారిని కట్టడి చేసి 69 పరుగుల తేడాతో అద్భుతమైన గెలుపును సొంతం చేసుకుంది. దీంతో మూడు టీ 20ల సిరీస్ 1-1తో సమం అయ్యింది.
శ్రీలంకపై భారత్ ఘన విజయం
మూడు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకపై భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 197 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటింగ్ మొదటిలోనే గట్టిదెబ్బ తగలడంతో తేరుకోలేకపోయింది. ఓపెనర్ దిల్షాన్ పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ ను సమర్పించాడు.తర్వాత ప్రసన్నకు అదే పరిస్థితి ఎదురైంది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, ఆశిష్ నెహ్రా, బూమ్రా, జడేజాలకు రెండు వికెట్లు చొప్పున తీశారు.
197 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచిన టీమిండియా
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 197 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 25 బంతుల్లో 51 పరుగులతో దూకుడుగా ఆడింది. జట్టు స్కోరు 75 పరుగుల దగ్గర శిఖర్ ధావన్ అవుట్ కావడంతో టీమిండియా కాస్త స్పీడ్ తగ్గింది. అనంతరం రోహిత్ శర్మ 35 బంతుల్లో 43 పరుగులు చేసి బాధ్యతాయుతంగా ఆడాడు. ఆ తర్వాత అజింక్యా రహానే 25 పరుగులు, సురేష్ రైనా 30 పరుగులు, పాండ్యా 27పరుగులతో జాగ్రత్తగా ఆడారు.దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ డకౌట్‌గా కాగా.. కెప్టెన్ ధోనీ నాటౌట్ గా నిలిచాడు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.