Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Infosis founder Narayana Murthy for President of India?

By   /  June 3, 2016  /  Comments Off on Infosis founder Narayana Murthy for President of India?

    Print       Email

Murthyరాష్ట్ర‌ప‌తి రేసులో నారాయ‌ణ‌మూర్తి?

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీ కాలం ముగుస్తుండ‌డంతో ఇప్పుడు ఆ స్థానంలో ఎవ‌రికి కూర్చోపెడితే బాగుంటుంద‌ని కేంద్ర స‌ర్కార్‌ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. దేశ ప్ర‌థ‌మ పౌరుడి ప‌ద‌వికి ఎవ‌రెవ‌రు స‌మ‌ర్థులు.. ఎవ‌రెరు ఈ రేసులో ఉన్నార‌నే దానిపై ప్ర‌స్త‌తం చ‌ర్చ న‌డుస్తోంది. అయితే గ‌తంలోనే ఈ పోటీలో నిలిచిన ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌.ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఈసారి కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇదే విష‌యాన్ని మీడియా వాళ్లు నారాయ‌ణ‌మూర్తిని అడ‌గ‌గా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని పలువురు సన్నిహితులు – నాయకులు తనను కోరారనీ – దానిపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదనీ మూర్తి తెలిపారు. ఈ పదవికి పోటీ పడుతున్న విషయమై వ్యాఖ్యానించేందుకు ఇది సరైన సమయం కాద‌ని మాట‌ను దాట‌వేశారు. అయితే రాష్ట్ర‌ప‌తిని ఎవ‌రిని చేయాలో, ఎవ‌రిని చేయ‌కూడ‌దు కేంద్ర ప్ర‌భుత్వానికి తెలుస‌ని పేర్కొన‌డం విశేషం.

అంతేకాదు ఇలాంటి పెద్ద పెద్ద విష‌యాలుపై నిర్ణయాలను కేంద్ర ప్ర‌భుత్వానికి వ‌దిలేయాల‌ని, ఎవ‌రు ప‌డితే వాళ్లు మాట్లాడ‌డం స‌బ‌బుగా ఉండ‌ద‌ని మూర్తి సున్నితంగా సమాధానం దాటవేశారు. ఇదిలా ఉండగా 2007లోనూ రాష్ట్రపతి పదవికి మూర్తి పేరు ప్రచారంలోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదన వెనక్కుపోయింది.తాజాగా మ‌రోమారు నారాయ‌ణ‌మూర్తి పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చింది. మ‌రి దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →