Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Interesting Title Registered In Mytri Makers Production

By   /  October 12, 2017  /  Comments Off on Interesting Title Registered In Mytri Makers Production

    Print       Email

మైత్రి మూవీస్ ఇంట్రెస్టింగ్ టైటిల్..!

 

EIS
EnGeniusInc

 

 

 

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన మైత్రి మూవీ మేకర్స్ క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తుంది. ప్రస్తుతం రాం చరణ్ సుకుమార్ కాంబోలో రంగస్థలం 1985 తెరకెక్కిస్తున్న ఈ నిర్మాణ సంస్థ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించారట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అంటే అమర్ అక్బర్ ఆంటోని అని తెలుస్తుంది. ఈ టైటిల్ ఏ హీరో సినిమాకు అన్నది మాత్రం తెలియలేదు.

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం మాస్ మహరాజ్ రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందట. ఆ సినిమాకే ఈ టైటిల్ పెట్టబోతున్నారని ఎక్స్ క్లూజివ్ టాక్. బెంగాల్ టైగర్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో రాజా ది గ్రేట్ సినిమాతో వస్తున్న మాస్ మహరాజ్ ఇక నుండి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. మరి బయటకు వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని టైటిల్ రవితేజ సినిమాకేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఇందులో రవితేజ మూడు పాత్రల్లో కనిపిస్తాడని చెప్పొచ్చు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Investigation starts on 25th for Jayalalitha’s mysterious death.

Read More →