బాబుకు కొత్త తలనొప్పి
నాయకుల్లో కొరవడిన సఖ్యత
కలవని కొత్త..పాత కలయికలు
ఒకరిపై మరొకరు విమర్శలు
చిన్నబాబు పెత్తనాన్ని సహించని సీనియర్లు
టీడీపీదంతా పైన పటారం.. లోన లొటారం
తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలను చూసి సంతోషపడాలో… తమ పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించలేక బాధపడాలో చంద్రబాబు నాయుడుకు అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. కొత్త..పాత ఎమ్మెల్యేల కొడవలతో బాబు తల బొప్పి కడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రోడ్డుకెక్కుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మేడి పండు చందంగా తయారైంది. ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాలో వైయస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరిన వారికి, పార్టీలో కొనసాతున్న వారి మధ్య పాత కక్ష్యలింకా కొనసాగుతూనే ఉన్నాయన్నది నిర్వివాదాంశం. వైయస్ఆర్సీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, పాక్ష్యన్ రాజ కీయాలను ప్రోత్సాహిస్తున్నారని స్థానిక పార్టీ ఇన్చార్జి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విమర్శిస్తున్నారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిల కుటుంబాల మధ్య మొదటి నుంచి పాక్ష్యన్ తగాదాలున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఒకే పార్టీలో కొనసాగుతున్న ఇరు వర్గాల మధ్య సఖ్యత కని పించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అచ్చంగా ఇదే పరిస్థితి కర్నూలు జిల్లాలోనూ కనిపిస్తోంది. వైయస్ఆర్సీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా సోదరుల మధ్య మొదటి నుంచి ఆధిపత్య పోరు కొన సాగుతున్న విషయం తెలిసిందే. భూమా చేరికను శిల్పా సోదరులు వ్యతిరేకించారు. అయినా పార్టీ నాయకత్వం భూమాను పార్టీలోకి ఆహ్వానించింది. పార్టీలో చేరిన తరువాత భూమా తమని కలుపుకుపోయే ప్రయత్నం చేయడం లేదని, ప్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారని శిల్పా సోదరులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. తమ అనుచరుడిపై జరిగిన హత్యాయత్నం వెనుక భూమా ప్రమేయముందని ఆరోపించారు. ఏది ఏమైనా తెలుగు దేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతానికి మేడి పండు చందాన్ని తలపిస్తోంది. ఎవరైనా ఒక్కరు నోరు విప్పారంటే పార్టీ పరువు బజారుకెక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.