ఘనంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్వ్యూ..
విశాఖ తీరంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్వ్యూ ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 70 విదేశీ యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లీట్ రివ్వ్యూను ప్రారంభించారు. అంతర్జాతీయ నౌకాదళ గౌరవవందనం స్వీకరించడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. ఈ పరేడ్ ప్రపంచంతో స్నేహ హస్తానికి నిదర్శనమన్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్వ్యూ మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పారు.
సముద్ర తీర రక్షణలో ఈ రివ్వ్యూ ముందుడుగు అని భారత రాష్ట్రపతి అన్నారు. శాంతి సామరస్యాలు కాపడటంలో ఈ ప్రదర్శనలు గొప్ప బలాన్ని ఇస్తాయని చెప్పారు. సముద్రతలంపై శాంతి నెలకొల్పడానికి నేవీది కీలక పాత్ర అన్నారు. హిందూ మహా సముద్రంలో..ఇండియా నిర్వహిస్తున్న పాత్ర అత్యంత ప్రధానమైనదని ప్రణబ్ అన్నారు. సముద్రతలం రక్షణకు, వ్యాపార కార్యక్రమాలకి నేవీ అండగా ఉంటుందన్నారు. ఈ రివ్వ్యూకి సహకారం అందించిన విశాఖ వాసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇందులో రాష్ట్రపతి ప్రణబ్ తో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.