Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Introducing FiberNet in AP

By   /  June 6, 2016  /  Comments Off on Introducing FiberNet in AP

    Print       Email

APFiberNetఇక రూ.150ల‌కే అన్నీ..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌తి కుటుంబానికి హైస్పీడ్‌ ఇంట‌ర్ నెట్‌. రాష్ట్రంలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి మాట్లాడుకోవాల‌న్నా ఫ్రీ కాల్‌. 100 ఉచిత ఛాన‌ళ్ల‌తో కేబుల్ సౌక‌ర్యం. ఇదంతా కేవ‌లం రూ.150ల‌కే. ఇప్ప‌టికే ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, అతి త్వ‌ర‌లోనే అందుబాటు తీసుకువ‌చ్చి రాష్ట్రంలోని దాదాపు రెండు కోట్ల కుటుంబాల‌కు ఈ స‌దుపాయం క‌ల్పిస్తామ‌ని హామీ ఇస్తోంది ఏపీ స‌ర్కార్‌.  దేశంలో హైస్పీడ్ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) నెట్‌వ‌ర్క్ ప‌నులు ప్రారంభించిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రికార్డు సృష్టించింది. కాగా హైస్పీడ్ ఆఫిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) సంస్థ  సుమారు రూ.330 కోట్లతో 13 జిల్లాల్లో ఇప్ప‌టికే పనులు ప్రారంభించింది. మొత్తం 23 వేల కిలోమీటర్ల పొడవునా ఎ24 కోర్‌-ఏడీఎస్ఎస్ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ను 33 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్‌ స్తంభాలకు అమర్చే పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ కేబుల్స్‌ను 2,449 సబ్‌స్టేషన్‌లలో సర్వర్‌లకు కలుపుతారు. విద్యుత్‌ ప్రవహించే లైనుకు మూడు అడుగుల దిగువన క్లాంపులు బిగించి దానికి కేబుళ్లు అమర్చుతున్నారు. సబ్‌స్టేషన్‌లలోని సర్వర్‌ నుంచి స్థానికంగా ఉండే కేబుల్‌ ఆపరేటర్లు ఇప్పటికే ఏర్పాటుచేసిన కేబుల్‌ ద్వారా ఇళ్లకు క‌నెక్ష‌న్లు ఇస్తారు.

తొలి దశలో ఉత్తరాంధ్ర జిల్లాలు, రెండో దశలో రాయలసీమ, చివరగా కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో లైన్లు వేయాలని స‌ర్కార్ నిర్ణ‌యించింది.  విశాఖ ఏజెన్సీలో 130 కిలోమీటర్ల మినహా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో లైన్ల ఏర్పా టు పూర్తయింది. ప్రతి జిల్లాలో లైన్లు ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. జూన్‌కల్లా పూర్తిచేయాలని ప్రతిపాదించినా కొన్ని ప్రతికూల పరిస్థితులతో కొంత ఆలస్యమైంది. జూలై నెలాఖరుకు రాష్ట్రమంతా లైన్లు వేయడం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తి అయి… ఇప్పుడు చెప్పిన‌ట్లుగానే రూ.150ల‌కే స‌ర్కార్ అందించ‌గ‌లిగితే మాత్రం ప్ర‌భుత్వానికి మంచిపేరు వ‌స్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →