Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

ప్రపంచవ్యా ప్తంగా ఉన్న తె లుగు రచయితలకి, సాహిత్యాభిమా నులకి మా విన్న పం

By   /  February 4, 2016  /  No Comments

    Print       Email

524px-Question_book-new.svgప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తెలుగు సాహిత్యాభిమానులకి “మధురవాణి” (www.madhuravani.com.) అనే సరి కొత్త అంతర్జాల పత్రిక తొలి సంచిక ఆత్మీయుల సమక్షంలో జనవరి 23, 2016 న ఆవిష్కరించబడింది. మా అంచనాలను అధిగమించి మొదటి వారంలోనే దేశదేశాల నుండి వేల కొలదీ పాఠకులు ‘మధురవాణి’ ని సందర్శించారని గూగులమ్మ సమాచారం అందించింది. చాలా మంది పాఠకులు ‘మధురవాణి” రూప కల్పన, వివిధ అంశాల పై అభిప్రాయాలూ, సూచనలూ మాతో పంచుకున్నారు. వారందరికీ మా హార్దిక ధన్యవాదాలు. పాఠకుల ఆదరణే ప్రాణవాయువుగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో మా నిర్వాహక బృందం మలి సంచిక రూపకల్పన మొదలుపెట్టాం. ఆ ఆదరణ మరింత ఇనుమడించడానికి ‘మధురవాణి’ లో మంచి రచనలు ప్రచురించడమే ఏకైక మార్గం అని మా నిర్వాహక బృందం నమ్మకం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకి, సాహిత్యాభిమానులకి మా విన్నపం

InCorpTaxAct
Suvidha

మీలో చాలా మందికి ఎంతో సృజనాత్మకత ఉండి ఈ పరుగుల జీవన ప్రవాహంలో మీ ప్రతిభను మరిచి ఉండవచ్చు! మరికొంత మందికి సమయాభావ సమస్య ఎక్కువ లేకపోయినా స్వీయ రచనా పాటవాన్ని  అందరితోటీ పంచుకునే అవకాశాలు లేక తటపటాయిస్తూ ఉండవచ్చును. తిరిగి మీ కలాన్ని ఒక్కసారి తట్టండి!  మీ హృది గదిలో పదిల పరిచిన  జ్ఞాపకాల పుస్తకంలో మరుగు పడిన మీ భావుకత పేజీని తిరిగి కొత్తగా వ్రాయండి! రచనావ్యాసంగంలో తరిస్తున్న అనుభవజ్ఞులు ‘మధురవాణి’ లో ప్రచురణకి ఒక సరి కొత్త రచన పంపించి మా లాభాపేక్ష లేని సాహితీ యజ్ఞం లో పాలు పంచుకోండి. తెలుగు భాష మనుగడకి సృజనాత్మక, నూతన సాహిత్య సృష్టి పెద్ద సోపానం అని మా నమ్మకం.

రాబోయే ఉగాది సమయంలో (ఏప్రిల్ 9, 2016) వెలువడే ‘మధురవాణి’ సంచికలో ప్రచురణకి పరిశీలనార్థం

మీ సృజనాత్మకతని ప్రతిబింబించే “అముద్రిత” స్వీయ రచనలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

  • సాహిత్యపరమైన వస్తువు ఏదైనా కావచ్చును. కథ, కవిత, వ్యాసం, అనువాద రచన మొదలైన సాహిత్య ప్రక్రియ ఏదైనా కావచ్చును. మధురవాణి త్రైమాసఅంతర్జాల పత్రిక మీ రచనలకు ఆహ్వానం పలుకుతుంది!
  • కేవలం యూనికోడ్ (గూగుల్, లేఖిని మొదలైన వెబ్ సైట్ లలో, గౌతమి మొదలైన ఫాంట్స్) లో ఉన్న రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, స్కాన్ చేసిన వ్రాత ప్రతులు, తదితర పద్ధతులలో వచ్చిన రచనలు పరిశీలించబడవు.
  • మీ రచన మీద సర్వహక్కులూ మీవే. కానీ దయ ఉంచి ఇంకెక్కడైనా పరిశీలనలో ఉన్న కథలు, కవితలు, వ్యాసాలు, ఇది వరలో ప్రచురించబడిన రచనలు మరో రూపంలోనూ పంపించకండి.
  • ఒకే సారి కథ, కవిత, వ్యాస ప్రక్రియలలో ఒక్కొక్క దానికి రెండు రచనలు మాత్రమే పరిశీలించబడతాయి.  అంతకు మించి ఎక్కువ రచనలు పంపిస్తే ఆమోదించబడవు.
  • మీ రచనతో పాటు అది మీ స్వీయ రచన అనీ, దేనికీ అనుకరణ కాదు అనీ హామీ పత్రం విధిగా జతపరచాలి. అనువాద రచనలు పంపించినప్పుడు మూల రచన, రచయిత వివరాలు విధిగా తెలియజెయ్యాలి.
  • మీ పాస్ పోర్ట్  ఫోటో, ఐదు వాక్యాలకు మించకుండా మీ వ్యక్తిగత, సాహిత్య పరమైన విశేషాలు తప్పక జతపరచాలి.
  • ఇది వరలో ప్రచురించబడిన ప్రాచీన, సమకాలీన రచనల పునర్ముద్రణ, అముద్రిత రచనల ప్రచురణార్హత మొదలైన అన్ని విషయాలలోనూ “మధురవాణి” నిర్వాహకులదే అంతిమ నిర్ణయం.
  • మీ రచన అందిన సుమారు నెల రోజులలో ఎంపిక వివరాలు తెలియపరుస్తాం. రాబోయే ఏ సంచిక లో అయినా మీ రచన ప్రచురించబడవచ్చును.

మీ రచన పంపించవలసిన చిరునామాలు:

కథా ​మధురాలు –  katha@madhuravani.com

కవితా వాణి – నిర్వహణ- – kavita@madhuravani.com

ఆధ్యాత్మిక వాణి & వ్యాస మధురాలు – vyasam@madhuravani.com

 

అన్ని విషయాలలోనూ మమ్మల్ని సంప్రదించ వలసిన ఇమెయిల్ 

sahityam@madhuravani.com

 

mmcQIAVW_400x400తెలుగు సాహిత్యాభిమానులకి విన్నపం

ఇటేవలే విడుదల అయిన ‘మధురవాణి’ తొలి సంచికలో సుప్రసిద్ద రచయితలు భువన చంద్ర, వేమూరి వెంకటేశ్వర రావు, సత్యం మందపాటి, మధు పెమ్మరాజు, వెంపటి హేమ, విజయలక్ష్మీ మురళీధర్ మొదలైన వారి కథలు, విన్నకోట రవిశంకర్, ముకుంద రామారావు, వారాల ఆనంద్ మొదలైన వారి కవితలు, ద్వానా శాస్త్రి , K. B. లక్ష్మి, ఎస్. నారాయణ స్వామి, దాసరి అమరేంద్ర మొదలైన వారి వ్యాసాలు, సినీ కవి చంద్ర బోస్ తో ప్రత్యేక ముఖా ముఖీ, వంగూరి పి.పా, దీప్తి ముచ్చట్లు, ‘శ్రీని’ వ్యాస వాణి మొదలైన శీర్షికలు, ఆధ్యాత్మిక వాణి, పుస్తక పరిచయాలు, హాస్య వాణి వగైరా ఆసక్తికరమైన అంశాలతో ఉన్న తాజా ‘మధురవాణి’ సంచిక ని www.madhuravani.com లో చదివి ఆనందించండి. మీ అభిప్రాయాలని పత్రికాముఖంగా అందరితోటీ పంచుకోండి.

 

మధురవాణి నిర్వాహక బృందం

చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ | సుధేష్ పిల్లుట్ల | దీప్తి పెండ్యాల |

శ్రీనివాస్ పెండ్యాల |  వంగూరి చిట్టెన్ రాజు

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →