Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

IPL Betting gone to next level

By   /  May 29, 2016  /  Comments Off on IPL Betting gone to next level

    Print       Email

iplఐపీఎల్ బెట్టింగ్ కోసం భార్య తాక‌ట్టు

 

InCorpTaxAct
Suvidha

 

క్రికెట్ బెట్టింగ్ ఏ స్థాయికి వెళ్లిందో ఇప్పుడు చెప్ప‌బోయే సంఘ‌ట‌న తెలుసుకుంటే మీకే అర్థ‌మ‌వుతుంది. ఎప్పుడో పురాణాల్లో మ‌నం ధ‌ర్మ‌రాజు జూదంలో ఓడ‌డం రాజ్యాల‌ను పోగొట్టుకోవ‌డం గురించి మ‌న పెద్ద‌వాళ్లు మ‌న‌కు చెబితే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు క‌ళ్లార చూస్తున్నాం. డ‌బ్బులు, ఆస్తులు వ‌ర‌కు బెట్టింగ్ పెట్టుకోవ‌డం మ‌నం చూశాం కానీ భార్య‌ను తాక‌ట్టు పెట్టిన సంఘ‌ట‌న ఎప్పుడు చూడ‌లేదు. కానీ కాన్పూర్‌లో అలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. పోలీసులు క‌థ‌నం ప్ర‌కారం… ఆ మ‌హిళ వివ‌రాలు వెల్ల‌డించ‌డానికి పోలీసులు ఇష్ట‌ప‌డ‌క‌పోయిన విష‌యాన్ని అయితే చెప్పారు. మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన ఓ వ్య‌క్తికి క్రికెట్ అంటే ప్రాణం. ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుతో పాటు.. ఆస్తుల‌ను కూడా తాక‌ట్టు పెట్టాడ‌త‌. అంత‌టి అత‌ను ఆగకుండా త‌న‌తో ఉన్న త‌న భార్య‌ను కూడా బెట్టింగ్‌లో పెట్టాడ‌ట‌.
అయితే అత‌ను ఆ మ్యాచ్ ఓడిపోవ‌డంతో బెట్టింగ్ పెట్టిన వాళ్లు ఆమెకు ఫోన్లు చేయ‌డం మొద‌లుపెట్టార‌ట‌. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాట‌. ఆ వేధింపులు తాళలేక పోయిన ఆ అభినవ ధర్మరాజు భార్య స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో పోలీసులను ఆశ్రయించింద‌ట‌. దీంతో బెట్టింగ్ కోసం భార్య‌ను తాక‌ట్టు పెట్టిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కాగా పెళ్లైన మొదటి రోజు నుంచే భర్త వ్య‌వ‌హార శైలి త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని, త‌న ద‌గ్గ‌ర ఉండే బంగారం తీసుకుని షేర్ మార్కెట్లో పెట్టి న‌ష్ట‌పోయాడ‌ని ఆమె పోలీసుల‌కు వివ‌రించింది. అంతేకాకుండా త‌న త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర నుంచి రూ.7 ల‌క్ష‌లు డ‌బ్బులు తీసుకురావాల‌ని హింసించేవాడ‌ని కూడా చెప్పింది. దీంతో బెట్టింగ్ పెట్టిన వాళ్ల‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →