అమెరికాను వణికిస్తున్న ఇర్మా హరికేన్..
హరికేన్ల ఎఫెక్ట్ తో అమెరికా అతలాకుతలం అవుతోంది. నిన్నగాక మొన్న టెక్సాస్ ని హర్వీ హరికేన్ నిలువునా ముంచేసింది. ఈ హర్వీ దెబ్బకు టెక్సాస్ భారీగా నష్టపోయింది. తాజాగా మరో హరికేన్ ఇర్మా అమెరికాని వణికిస్తోంది. ఈ ఇర్మా ఇప్పటికే కరేబియన్ దీవులను దాటేసింది. ప్రస్తుతం ఫ్యూర్టోరికా మీదుగా ఫ్లోరిగా వైపు సాగుతోంది.
ఇర్మా ఎఫెక్ట్ తో కరేబియన్ దీవుల్లో భారీ నష్టం వాటిల్లింది. దీని దెబ్బకు ఏడుగురు మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. బార్బుడా, సెయింట్ మార్టిన్ దీవులపై కూడా ఇర్మా హరికేన్ ఎఫెక్ట్ అధికంగా ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన సెయింట్ మార్టిన్ దీవి దాదాపు 95శాతం మేర ధ్వంసమైంది. ఒక్క సెయింట్ మార్టిన్లోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. బార్బుడా ద్వీపం అంతటా రాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తుఫానులు రావడం కారణంగా ఇర్మా బాగా బలపడిందని వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ఇర్మా ప్రభావం కారణంగా పలు దీవుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాదాపుగా 30 లక్షల మంది అంధకారం బందీ అయ్యారు. పలు దీవుల్లో నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో ముమ్మర సహయక చర్యలు చేపడుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.