Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Irom Sharmila granted bail, set to break fast soon..

By   /  August 9, 2016  /  Comments Off on Irom Sharmila granted bail, set to break fast soon..

    Print       Email

Irom Sharmila 1ఆమరణదీక్షను విరమించిన ఉక్కు మహిళ..

 

InCorpTaxAct
Suvidha

 
16 ఏళ్ల ఆమరణ నిరాహార దీక్షను మానవ హక్కుల కార్యకర్త ఇరోమ్‌ షర్మిలా విరమించారు.త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఈమె మణిపూర్ లో సైనిక దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జైలుకు వెళ్ళారు. అక్కడే తన నిరాహార దీక్షను కొనసాగించారు.

2000 సంవత్సరంలో మణిపూర్ లోని ఓ గ్రామంలో అసోం రైఫిల్స్ దాడిచేసి కాల్పులు జరిపాయి. దీంతో దాదాపుగా పదిమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో షర్మిల సైనిక దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు.అది తీవ్రతరం కావడంతో పోలీసులు షర్మిలను జైలుకు తరలించారు. అప్పటినుంచి ఇరోమ్‌ షర్మిలా జైల్లోనే దీక్ష కొనసాగించారు.

అయితే.. షర్మిల జైలులో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ముక్కు ద్వారా పైపును అమర్చి.. దాని ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే నేటికి షర్మిల తన మనసు మార్చుకున్నారు. ఏకంగా 16 ఏళ్ళ ఆమరణ దీక్షను విరమించారు. అంతేకాదు.. రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి సైనిక చట్టాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. ఇరోమ్ షర్మిల దీక్ష విరమించడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →