అమరావతి..అంతా మాయేనా?
ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు భూమి సేకరణ తప్పితే అమరావతిలో ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. చాలా విషయాలు మంత్రులకు, ఉన్నతాదికారులకే తెలియదు. అంతటా గోప్యం. అందుకే అంత అయోమయం. అసలు అమరావతిలో ఏం జరగుతోంది?. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి రెండేళ్లు దాటింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంత వరకూ భూసమీకరణ తప్ప ఇంకేపనీ జరగలేదు. సింగపూర్ నిపుణులు ఇచ్చిన ప్లాన్ ఇప్పటికి రెండు సార్లు మార్చారు. మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు అంతర్జాతీయ ఆర్కిటెట్లను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం ఒక నిపుణుల కమిటీని నియమించి జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్‌ను ఎంపిక చేశారు. వారు ఆరుమాసాల పాటు సమయం తీసుకుని చివరకు డిజైన్లను ఇచ్చారు. సదరు డిజైన్లు విడుదల చూడగానే అందరూ ముక్కున వేలేసుకున్నారు. వారుఇచ్చిన డిజైన్లు పొగ్గొట్టాలు మాదిరిగా ఉందని అందరూ నవ్వటమే. పాకిస్ధాన్ మీడియాలో అయితే, ఏకంగా అమరావతిలో న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది.
ఆ మాత్రం డిజైన్లకు మన ప్రభుత్వం జపాన్ కంపెనీకి ఏకంగా రూ. 90 కోట్లు సమర్పించుకున్నది. అంతకుముందు సింగపూర్ ఇచ్చిన డిజైన్లకు రెండుసార్లు మార్పులు చేర్పులు చేసారు. దాంతో ఫైనల్ డిజైన్లను సింగపూర్ ఇంత వరకూ ఇవ్వలేదు. స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణ బాధ్యతలను చేపడతామరని ఒకవైపు చెబుతూనే ఇంకోవైపేమో అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని దేశ దేశాలను ఆహ్వానించటమేమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాజధాని నిర్మాణ బాధ్యతలు సింగపూర్‌కు అప్పగించిన తార్వాత మిగిలిన దేశాలు ఏ విధంగా భాగస్వాములవుతాయి? అమరావతిలోని నిర్మాణాలు ఏ రీతిన ఉంటాయన్న ప్రశ్నకు ఉన్నతాధికారులు కూడా సమాధానాలు చెప్పలేకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ దేశానికి వెళితే అక్కడ కనబడిన సాంకేతిక విప్లవాల పేరుతో ఒప్పందాలు కుదిర్చేసుకుంటున్నారు. చైనాకు వెళ్ళినపుడు అక్కడ బుల్లెట్ రైళ్ళు నచ్చింది. వెంటనే రైలు ఏర్పాటుకు మాట్లాడేసుకున్నారు. అమరావతి నుండి విశాఖపట్నం, అమరావతి నుండి హైదరాబాద్‌కు రెండు బుల్లెట్ రైళ్ళు రాబోతున్నట్లు ప్రకటించేశారు. అసలు, రైలు మార్గం ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఒప్పందాలు చేసుకోవటమేమిటి? రైళ్ల ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం కాదుకదా అని పలువురు ముక్కున వేలేసుకుం టున్నారు. లండ న్ వెళ్ళినపుడు థేమ్స్ నది ఒడ్డున కనబడిన ‘లండన్ ఐ’ లాంటిది అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేశారు.
ఇపుడు ఆస్తానా లో కనబడిన కేబుల్ కార్ల లాంటివాటిని అమరావతిలోను, పర్వత ప్రాంతాల్లో రోప్‌వే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించేశారు. అసలు మన రాష్ట్రంలో కొండ లేగాని పర్వాతాలెక్కడనుయ్యాంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. విదేశాల్లో బాగున్నవన్నీ మన దేశంలోను లేదా మన రాష్ట్రంలో బాగుంటాయని, విజయవంతమవుతాయని లేదు. ఆ దేశ వాతావరణ పరిస్ధితులకు అవి సరిపో యుండచ్చు. ఒకవైపు అమరావతి నిర్మాణ బాధ్యతలను విదేశాలకు కట్టబెట్టాలని అనుకుంటూనే ఇంకోవైపు అమరావతికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తా నంటూ పదే పదే చెబుతున్న చంద్రబాబు మాత్రం నవ్వుల పాలు అవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.