Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Is AP CM Chandra babu now calm down?

By   /  August 3, 2016  /  Comments Off on Is AP CM Chandra babu now calm down?

    Print       Email

chandrababuబాబు ర‌క్తం చ‌ల్ల‌బ‌డిందా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ సీఎం చంద్ర‌బాబు ర‌క్తం చ‌ల్లబ‌డిందా?  కేంద్రంతో అమీ తుమీ తేల్చుకుంటామ‌న్న బాబు మ‌ళ్లీ కేంద్రంతో కొన‌సాగేందుకు సిద్ధ‌ప‌డ్డారా? త‌మ ఎంపీల‌కు కూడా అదే దిశానిర్దేశం చేశారా? ప‌్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోయినా జీఎస్టీ బిల్లుకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారా? అవున‌నే చెప్పాల్సి వ‌స్తోంది ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తావుంటే. వివ‌రాల్లోకి వెళ్లితే…‘కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చూసి నా రక్తం సలసల కాగింది. ఇది ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన  వ్యాఖ్య. జైట్లీ సమాధానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పిన చంద్రబాబునాయుడు విజయవాడలో అత్యవసరంగా ఎంపీలు..మంత్రులు..సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో చేసిన తీర్మానం ఏంటంటే కేంద్ర మంత్రులు..ఎంపీలు మూకుమ్మడిగా వెళ్లి ప్రధాని మంత్రిని కలసి ప్రత్యేక హోదాపై తేల్చుకుంటారు అని. తేల్చుకోవటం సంగతి అలా ఉంచితే టీడీపీ ఎంపీలు కోరినా ప్రధాని నరేంద్రమోడీ ఇంత వరకూ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.

గత రెండు రోజులుగా ఎంపీలు పార్లమెంట్ లో గాంధీ విగ్రహం వద్ద ధర్నాలు…లోపల నిరసనలు చేసింది. బుధవారం  రాజ్యసభలో జీఎస్ టీ బిల్లు వస్తుండటంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మళ్ళీ ఓ మొక్కుబడి ప్రకటన చేశారు. అంతే తప్ప..అదనంగా ఒనగూరింది శూన్యం. సభ సాక్షిగా జైట్లీల ఫ్రెండ్లీ పార్టీ..కాబట్టి రాష్ట్రం కాబట్టి ఇవ్వలేం అని చెప్పి…మళ్లీ ఇప్పుడు చూస్తున్నాం..చేస్తున్నాం అని చెప్పితే ..టీడీపీ మంత్రులు..ఎంపీలు మాత్రం కొంత కాలం వేచిచూస్తాం అని వ్యాఖ్యానించారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు మాత్రం తాను  ఇఫ్పటికే 29 సార్లు మోడీని కలిశానని..ఆయనకు బాధ్యత లేదా? రెండు గంటలు దృష్టి పెడితే సరిపోతుందని ప్రకటించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రం మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఇంకా సమాచారం తెప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించటం విశేషం.

అసలు కేంద్రం విభజించిన రాష్ట్రానికి ధర్మబద్దంగా ఇవ్వాల్సిన ప్రత్యేక హోదానే ఇవ్వనని నిష్కర్షగా చెబుతుంటే..అదొక్కటే చాలదు..మేం ఇంకా చాలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని ప్రకటించటం విశేషం. కేంద్ర ప్రభుత్వం కానీ..బిజెపి కానీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా కూడా తాము జీఎస్టీకి బేషరతు మద్దతు ప్రకటిస్తామని..ఇందుకు చంద్రబాబు కూడా సమ్మతించారని సుజనా చౌదరి వెల్లడించారు. జీఎస్టీ జాతీయ అంశమే..ఎవరూ కాదనరు. మరి ఇస్తామన్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపికి టీడీపీ ఎందుకు మద్దతు ఇవ్వాలి?. అంటే అదే తెలుగుదేశం రాజకీయం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →