Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Is he really working on AP Development – Chandra babu

By   /  July 4, 2016  /  Comments Off on Is he really working on AP Development – Chandra babu

    Print       Email

chandrababuఅభివృద్ధి అంటే ఇదేనా బాబూ?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న ప‌నులు చూస్తా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డానికి చేస్తున్నారా? రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేయ‌డానికి చేస్తున్నారా? అనే అనుమానం ప్ర‌జ‌ల‌కు క‌లుగుతోంది. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌జా సంక్షేమాన్ని చూడాల్సిన బాబు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు చూసిన త‌ర్వాత  ప్ర‌జ‌ల వినాశ‌నాన్ని కొరుకుంటున్నారా అనిపిస్తోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని రోడ్లను మరింత వెడల్పు చేసేందుకు.. అభివృద్ధి కార్యక్రమాలకు వీలుగా దాదాపు 30 దేవాలయాల్ని కూల్చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కోట్లాది మంది సెంటిమెంట్లను దెబ్బ తీసే అంశం కూడా. ఒకవేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వ‌స్తే మత పెద్దలు మొదలు.. స్థానిక నేతలు.. కాలనీ నాయకులు అందరిని ఈ వ్యవహారంలోకి తీసుకురావాలి. ఎక్కడా ఎలాంటి వివాదాలు రేగకుండా.. ప్రక్రియ మొత్తం సంప్రదాయ బద్ధంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా రాత్రికి రాత్రి ప్రొక్లయిన్లు తీసుకొచ్చి కొట్టేయటం.. అలా కొట్టేసే అంశంలో.. తెలుగుదేశం పార్టీ నేతలు.. కార్యకర్తల ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయటం ఇప్పుడు పెను వివాదానికి దారి తీసింది.

పెద్ద ఎత్తున దేవాలయాలు కూల్చిన ఘటనపై ఏపీ బీజేపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేవాలయాలు కూల్చిన ప్రాంతాల్ని సందర్శించటం.. ఈ సందర్భంగా ఏపీ సర్కారు తీరును తప్పు పట్టటం.. దీనికి కౌంటర్ అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోవటం ఇప్పుడు ఇదో పెద్ద ఇష్యూగా మారింది. అంతేకాదు బాబుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న త‌రుణంలో చంద్ర‌బాబు నాయుడు క‌ళ్లు తెరిచి నేడు జ‌ర‌గాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని వాయిదా వేసి.. మత పెద్దలు.. మంత్రులు.. మిగిలిన నేతలతో స‌మావేశం కానున్నారు. అయితే అంతా జ‌రిగిపోయేక ఇప్పుడు స‌మావేశం ఏర్పాటు చేసి ఏం లాభ‌మ‌ని కొంద‌రంటుంటే.. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌డం అంటే ఇదేనంటూ మ‌రికొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ఏదేమైనా చంద్ర‌బాబు నాయుడు ఇదో పెద్ద మ‌చ్చ‌గా నిల‌వ‌నుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →