Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Is ‘Janatha Garrage ‘ Samantha’s final movie..?

By   /  August 5, 2016  /  Comments Off on Is ‘Janatha Garrage ‘ Samantha’s final movie..?

    Print       Email

samantha naga chaitanya‘జనతా గ్యారేజ్’ సమంత ఆఖరి సినిమా..?

 
తన నటనతో.. అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ముద్దుగుమ్మ సమంతా. దీంతో ప్రేక్షకులు ఆమెకు స్టార్ హీరోయిన్ గా పట్టం కట్టేశారు. అలాగే టాప్ హీరోయిన్ లా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ను కూడా ఏలుతోంది. ఓవరాల్ గా తెలుగు, తమిళ భాషల్లో ఈ ముద్దుగుమ్మ ఏకంగా 25కు పైబడి సినిమాల్లో నటించేసింది. ఇటీవలె ఈ హాట్ బ్యూటీ గురించి హాట్ హాట్ వార్తలు హల్ చల్ చేశాయి. సమంతకు అక్కినేని వారసుడు నాగచైతన్యతో లవ్ ఎఫైర్ ఉందంటూ ప్రచారం సాగింది. త్వరలో పెళ్ళి కూడా జరగబోతోందని అప్పుడప్పుడు సమంత చెప్పకనే చెప్పింది.
అలాగే సమంత గురించి ప్రస్తుతం మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. త్వరలో పెళ్ళి జరగబోతోంది కనుక.. సినిమాలను తగ్గించుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ధనుష్ సినిమాకి ఈ ముద్దుగుమ్మ నో చెప్పేసింది. అంతేకాదు.. చైతూ నెక్ట్స్ మూవీ నుంచి కూడా బయటకు వచ్చేసిందని టాక్. దీంతో ‘జనతా గ్యారేజ్’ సినిమానే సమంత చివరి సినిమా అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

InCorpTaxAct
Suvidha

ప్రస్తుతం కేరళలో ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ లో ఈ మిల్కీ బ్యూటీ నటిస్తోంది. ఇదే సమంతకు చివరి సాంగ్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో సమంత నోరువిప్పితేగాని తెలియదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →