Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Is Jayaram Ramesh telling the truth

By   /  August 4, 2016  /  Comments Off on Is Jayaram Ramesh telling the truth

    Print       Email

Jairam Rameshనిజం చెప్పిన జైరాం

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ విభజన చట్టాన్ని తయారు చేయటం దగ్గర నుంచి ఏపీ విభజనకు సంబంధించి కీలక వ్యవహారాలు మాజీ కేంద్ర మంత్రి జైరాం ర‌మేశ్‌కు తెలిసినంత బాగా మరెవరికీ తెలియ‌ద‌నే చెప్పాలి. విభజన చట్టంలోని లోటుపాట్ల మీద కూడా ఆయనకు అవగాహన ఎక్కువే. అలాంటి ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసే తొండి వాదనలోని మంచి చెడుల గురించి ఇట్టే చెప్పేయగలరు. మిగిలిన నేతలంతా నోరు ఏసుకొని విరుచుకుపడితే.. జైరాం మాత్రం అందుకు భిన్నంగా పాయింట్లు చెప్పగలరు. అలాంటి ఆయన తాజాగా ఏపీకిప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోదంటూ జైట్లీ చేసిన వాదన తప్పని తేల్చేశారు. అసలు 14వ ఆర్థిక సంఘానికి.. ఏపీ ప్రత్యేక హోదాకు లింకు పెట్టటంలో అర్థం లేదని ఆయన చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయం 14వ ఆర్థిక సంఘానికి సంబందించిందని జైట్లీ చెప్పటం.. తప్పు దారి పట్టించటమేనని.. ఏపీ ప్రజల్ని మోసం చేసినట్లుగా జైరాం తేల్చి చెబుతున్నారు.

మోడీ అనుకోవాలే కానీ.. రేపొద్దున నుంచి ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని.. హోదా ఇవ్వటం ఇష్టం లేకనే తప్పుడు మాటలు చెబుతున్నారంటూ జైరాం ఫైర్ అయ్యారు. ప‌నిలో ప‌నిగా ఏపీ నేత‌ల‌ను సైతం విమ‌ర్శించారు. టీడీపీ ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని చెప్పి ఇప్పుడు చేతులుముడుచుకు కూర్చుంద‌ని కూడా అన్నారు. కాగా ఇన్ని నిజాలు తెలిసిన జైరాం.. తమ అధినేత్రి సోనియాగాంధీ, యువ‌రాజు రాహుల్ గాంధీ చేత లోక్ సభలో ప్రధాని మోడీ సాక్షిగా అడిగించేస్తే సరిపోతుంది మ‌రికొంత‌మంది వాదిస్తున్నారు. ఏది ఏమైనా జైరాం చెప్పిందే నిజ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →