Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Is ‘Raja cheyyi veste’ movie helps Taraka Ratna’s career..

By   /  March 28, 2016  /  Comments Off on Is ‘Raja cheyyi veste’ movie helps Taraka Ratna’s career..

    Print       Email

nara rohith taraka ratna

రాజా చెయ్యివేస్తే ఆ హీరోకు కలిసొస్తుందా..?

InCorpTaxAct
Suvidha

 

ఇప్పుడు అందరూ నారా రోహిత్ ఏకంగా 9 సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడని చెప్పుకుంటున్నారు. కాని కొన్నేళ్ళ క్రితం ఒకే రోజున ఓ యంగ్ హీరో ఏకంగా 9 సినిమాలను స్టార్ట్ చేశాడు. ఆ సినిమాలన్ని కూడా రామకృష్ణ స్టూడియోలో ఒకేసారి ప్రారంభం అయ్యాయి. అయితే అప్పట్లో అదే పెద్ద న్యూస్. ఇంతకీ ఆ హీరో ఎవరో అర్ధమైపోయిందా..? ఆయనే నందమూరి తారకరత్న.

అయితే మొత్తం 9 సినిమాలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయట. మిగిలినవి కొంతకాలం షూటింగ్ జరుపుకుని ఆగిపోయాయట. మరికొన్ని అయితే అసలు స్టార్ట్ కూడా కాలేదట. ఇక హీరోగా తారకరత్నకు కనీసం ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆ మధ్య కొంతకాలం పాటు ఆయన అసలు తెరమీద కనిపించకుండా పోయారు. చివకు అమరావతి సినిమాలో విలన్ క్యారెక్టర్ లో కనిపించినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

అయితే .. ప్రస్తుతం ఈ నందమూరి హీరో మళ్లీ విలన్ గా అవతారమెత్తాడు. నారా రోహిత్ సినిమా ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. సినిమాలో తారకరత్న పాత్రను చాలా ప్రత్యేకంగానే తీర్చిదిద్దారని.. ట్రైలర్ చూస్టే అర్థమవుతోంది. తారకరత్న గెటప్ కానీ.. అతడి డైలాగ్ మాడ్యులేషన్ కానీ.. బాగానే ఉన్నాయనిపిస్తోంది. సినిమాలోనూ కంటెంట్ ఉన్నట్లే అనిపిస్తోంది. సో.. ఈ మూవీ హిట్ తో అయినా తారకరత్న మళ్లీ కెరీర్ స్టార్ట్ అవుతుందేమో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →