Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Ishrat Jahan case: BJP cites role of Chidambaram..

By   /  March 2, 2016  /  Comments Off on Ishrat Jahan case: BJP cites role of Chidambaram..

    Print       Email

 

ishrat_jahan 1

InCorpTaxAct
Suvidha

చిదంబరం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ?

 

 

కాంగ్రెస్ నేత చిదంబరం మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇష్రత్ జహాన్ కేసు కాంగ్రెస్ సీనియర్ నేతను చుట్టుకోనుంది. యూపీఏ హాయాంలో ఈ కేసు వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు రంగం సిద్దమవుతన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో మరోసారి.. గుజరాత్‌లో ఇష్రత్ జహాన్ కేసు తెరపైకి వచ్చింది.

గతంలో ఈ కేసుకు సంబంధించి దాఖలైన రెండో అఫిడవిట్‌ను కేంద్ర హోంమంత్రిగా పనిచేస్తున్న సమయంలో చిదంబరమే స్వయంగా మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోదీని ఇరికించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే చిదంబరం ఈ పని చేశారని కేంద్ర టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి ఇష్రత్ జహాన్ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా ఉందని బీజేపీ అంటోంది. ఆమె ముగ్గురు లష్కర్-ఏ-తయ్యబా ఉగ్రవాదులతో కలిసి మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో చంపేందుకు ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్ కౌంటర్ జరగడంతో ముగ్గురు హతమయ్యారని చెప్పుకొచ్చారు.
అయితే జహాన్ ఎన్‌కౌంటర్ ఓ బూటకపు ఎన్ కౌంటర్ అంటూ కాంగ్రెస్ వాదిస్తూ వచ్చింది.

 

అయితే ఇష్రత్ జహాన్ లష్కర్-ఏ ఉగ్రవాదే అని ఇటీవల విచారణ సందర్భంగా ముంబై దాడుల కేసులో ప్రధాన నిందితుడు డేవిడ్ హెడ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇష్రత్ జహాన్ కేసులో మోదీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా చిదంబరం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చారంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది.

 

ఉగ్రవాది అయిన ఇష్రత్‌‌ను బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని బీజేపీ సర్కారు భావిస్తోంది.దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించేందుకు సైతం అధికార బీజేపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ కేసు ద్వారా కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలన్నది బీజేపీ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →