Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

ISRO: 20 Satellites to space

By   /  June 22, 2016  /  Comments Off on ISRO: 20 Satellites to space

    Print       Email

ISRO launches India's fifth navigation satellite IRNSS-1E powered by PSLV rocketరోద‌సిలోకి ఒకేసారి 20 ఉప‌గ్ర‌హాలు

 

InCorpTaxAct
Suvidha

 

 

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) విజయాల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూనే ఉంది. ఇప్ప‌టికో ఎన్నో రాకెట్‌ల‌ను క‌క్ష‌ల్లోకి ప్ర‌వేశ‌పెట్టిన ఇస్రో ఈ సారి మ‌రో రికార్డును సొంతం చేసుకోబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ చేయ‌ని విధంగా ఈసారి బుధ‌వారం ఉద‌యం 9:26 గంట‌ల‌కు ఒకేసారి 20 ఉప గ్ర‌హాల‌ను రోద‌సిలోకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2008లో అత్య‌ధికంగా 10 ఉప‌గ్ర‌హాల‌ను  ఒకేసారి కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో ఈసారి ఆ సంఖ్యను 20కి పెంచింది. ఈ ప్రయోగం కోసం.. తన విజయాశ్వమైన ధ్రువ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్ఎల్‌వీ-సీ -34ను 36వ సారి ఉప‌యోగిస్తోంది.  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ఉన్న రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుంది. మనదేశానికి చెందిన భూ పరిశీలన కోసం రూపొందించిన 7275 కిలోల కార్టోశాట్‌-2 ఉపగ్రహంతోపాటు తమిళనాడు సత్యభామ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన1.5 కిలోల బరువుకలిగిన సత్యభామ శాట్‌ను, పుణె ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఒక కిలో బరువున్న స్వయంశాట్‌ను రోదసిలోకి చేరవేయనున్నారు.

వీటితోపాటు ఇండోనేసియాకు చెందిన120 కిలోల ల‌పాన్‌-ఎ8 జర్మనీకి చెందిన 180 కిలోల బీరోస్‌, కెనడాకు చెందిన 85 కిలోల ఎం-8ఎంశాట్‌25.5 కిలోల జీహెచ్‌జీశాట్‌-డి,అమెరికాకు చెందిన (గూగుల్‌ కంపెనీకి చెందిన టెర్రాబెల్లా రూపొందించిన ఎర్త్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌) 110 కిలోల స్కైశాట్‌ జెన్‌-2అలాగే ఒక్కొక్కటీ4.7కిలోల చొప్పున బరువు కలిగిన 12డవ్‌ ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. భూమికి 515 కిలోమీటర్ల ఎత్తు నుంచి 526 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఈ20 ఉపగ్రహాలనూ పీఎ్‌సఎల్‌వీ-సీ34 విడిచిపెట్టనుంది. భూమధ్యరేఖకు 97.48 డిగ్రీల వాలులోని సూర్యానువర్తన కక్ష్య(సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌)లోకి వీటిని చేరవేయనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →