Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

ISRO Success Journey

By   /  May 24, 2016  /  Comments Off on ISRO Success Journey

    Print       Email

591514560-isro_6`రాకెట్‌`లా దూసుకుపోతున్న`ఇస్త్రో`

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇస్త్రో త‌న విజ‌యాల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూనే ఉంది. తాజాగా ఆ లిస్టులో ఆర్ఎల్‌వీ కూడా చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్వీ)ని విజయవంతంగా ప్రయోగించింది. నిన్న‌ ఉద యం 7 గంటలకు ధ్వని కంటే ఐదు రెట్లు వేగంతో నింగిలో 70 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిన రాకెట్ 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళాఖాతంలో ఏర్పాటుచేసిన వర్చువల్ రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఇస్రో ఈ తరహా రాకెట్‌ను ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాల వ్యయం పదిరెట్లు తగ్గనుంది. ఆర్ఎల్వీ-టీడీ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం వల్ల పూర్తిస్థాయి పునర్వినియోగ వాహకనౌకను సిద్ధం చేయడానికి మార్గం సుగమమైంది. దీంతో ఉపగ్రహాలను క‌క్ష‌లోకి ప్రవేశపెట్టి, తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించి, నేలపైకి దిగడానికి వీలవుతుంది.

ప్రస్తుతం ఉన్న సంప్రదాయ వాహకనౌకలకు ఆ సామర్థ్యం లేకపోవడంతో అంతరిక్ష ప్రయోగ వ్యయం ఎక్కువవుతోంది. దీంతో పునర్వినియోగ వాహకనౌక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ఆర్ఎల్వీ-టీడడీ పొడవు 6.5 మీటర్లు. బరువు 1.75టన్నులు. ఇది చూడటానికి అమెరికా స్పేస్ షటిల్ మోడల్‌లో ఉంటుంది. డెల్టా ఆకారంలో రెక్కలున్నాయి. దీనిని 9మీటర్ల పొడవు, 11 టన్నుల బరువున్న ఘన ఇంధన రాకెట్ మోసుకెళ్లింది. భూమి నుంచి 70 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లిన ఈ వ్యోమనౌక.. అక్కడి నుంచి తిరిగి కిందకు పయనమైంది. అలా 11 నిమిషాల వ్వవధిలో సముద్రంలో ఏర్పాటుచేసిన వర్చువల్ రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఇస్రో చేపట్టిన ఆర్ఎల్‌వీ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →