అంతరిక్షంలోకి ఒకేసారి 22 ఉప గ్రహాలు
ఇస్త్రో విజయాల పరంపర కొనసాగుతున్న తరుణంలో మరికొన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు మూహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్తో) చైర్మన్ కిరణ్‌కుమార్ స్పందించారు. కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ శనివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్‌కుమార్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో మరో కొత్త ప్రయోగానికి ఇస్త్రో సిద్ధమైందని, జూన్ నెలాఖరులో ఒకేసారి 22 ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని ఆయన పేర్కొన్నారు. పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని విజయవంతంగా పరీక్షించిన తరువాత తమ తదుపరి ప్రయోగం వచ్చే నెలలో 22 ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరక్షింలోకి పంపడమేనని చెప్పారు.
ఇస్రోకు చెందిన పోలార్ రాకెట్ పీఎస్ఎల్వీ సీ34ను ఇందుకు ఉపయోగించనున్నామని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ కే శివన్ చెప్పారు. తాము ప్రయోగించే వాటిలో అమెరికా, కెనడా, ఇండొనేషియా, జర్మనీకి చెందిన ఉపగ్రహాలు కూడా ఉంటాయని తెలిపారు. ఇంతకుముందు ఇస్రో 2008లో ఒకేసారి పది ఉపగ్రహాలను ప్రయోగించి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఉపగ్రహాల ప్రయోగం తరువాత స్కాటరోమీటర్ను తదనంతరం ఇన్శాట్ 3డీఆర్‌ను ప్రయోగించనున్నామని కిరణ్‌కుమార్ వెల్లడించారు. మొత్తంగా చూస్తే ఇలాంటి విజయాలతో ఇస్త్రో దూసుకుపోవడం భారత్‌కు శుభపరిణామమే అని చెప్పొచ్చు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.