అమెరికా దిగువ సభకు భారతీయ వనిత..?
భారతీయుల్లో అపార ప్రతిభావంతులు ఉన్నారు. అలాంటి వారు స్వదేశంలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా రాణిస్తున్నారు. తాజాగా అమెరికా దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు ఓ భారతీయ మహిళ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈమె చెన్నైకి చెందిన మళయాళీ వనిత.
ఈమె పేరు ప్రమీల జైపాల్( 50 ). ఈమె అమెరికా దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓపెన్ ప్రైమరీ ఎన్నికల్లో వాషింగ్ టన్ స్టేట్ లోని ఏడో జిల్లాలో ప్రమీలా 38 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. వచ్చే నెలలో ప్రతినిధుల సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఓపెన్ ప్రైమరీలో ఆమె చేతిలో ఓటమి పాలైన ఇద్దరిలో ఒకరు ఆమెతో పోటీ పడతారు. ప్రమీలా జైన్ కు డెమోక్రటిక్ పార్టీ నేత బెర్నీ శాండర్స్ మద్దతు ప్రకటించారు.
ఇదిలాఉండగా.. ప్రతినిధుల సభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ముగ్గురు భారతీయులు బరిలో నిలుస్తున్నారు. వీరిలో అమీబెరా కాలిఫోర్నియా నుంచి రెండుసార్లు గెలిచారు. షికాగో నుంచి రాజా కృష్ణమూర్తి, సిలికాన్ వ్యాలీ నుంచి రో ఖన్నా కూడా బరిలో ఉన్నారు. వీరందరిని విజయం వరించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమీబెరా ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ లో ఉన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.