కలిసి పోయారు!
సీమలో మరీ ముఖ్యంగా అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి.. పరిటాల కుటుంబాల మధ్య ఎప్పటి నుంచి ఫ్యాక్షన్ కక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలు కలుస్తాయని అక్కడి ప్రజలు కలలో కూడా అనుకోరు.. అయితే అలాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్లితే… ఆ మధ్య హంద్రీ- నీవా ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చారు. ఆయన వెంట పరిటాల శ్రీరామ్ కూడా ఆత్మకూరుకు వచ్చారు. అక్కడ ఎదురుపడిన జేసీ దివాకర్ రెడ్డి పరిటాల శ్రీరామ్ ను ఆత్మీయంగా పలుకరించారు. శ్రీరామ్ కూడా ఆయనకు ప్రతినమస్కారం చేసి గౌరవించారు. జిల్లా ప్రజానీకానికి ఈ సన్నివేశం ఆశ్చర్యానందాలను కలిగించిన మాట వాస్తవం. ఇటువంటి సన్నివేశమే మరోసారి జడ్పీ చైర్మన్ నివాసం వద్ద పునరావృతమైంది. రంజాన్ సందర్భంగా జడ్పీ చైర్మన్ చమన్ ముస్లింలకు విందు ఏర్పాటుచేశారు.
రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై ఉండి పరిటాల శ్రీరామ్ – జేసీ దివాకర్ రెడ్డి ప్రార్థనలు జరిపారు. ఈ దృశ్యం కూడా రాజకీయ వర్గాలకు ఆసక్తిని కలిగించింది. గత కొన్నేళ్లుగా వీరిమధ్య సిద్ధాంతాలు – రాద్దాంతాలు ఉన్నా పార్టీ వైఖరికి కట్టుబడి – సీఎం చంద్రబాబు మాటకి విలువ ఇవ్వడం వల్లే ఈ రెండు కుటుంబాల ప్రతినిధులు కలివిడి మసలుకుంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.