Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Jagan Supports AP Servey Employees

By   /  November 30, 2017  /  No Comments

    Print       Email

ఏపీ సర్వే ఎంప్లాయిస్‌ కి జగన్ భరోసా..!

 

Suvidha
Biryani Pot

 

 

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పట్ల పల్లెల్లో ఆత్మీయత ఉట్టిపడుతోంది. అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అన్నొస్తున్నాడు అంటూ జనం రోడ్డుపైకి పరుగెత్తుకొస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది.

జగన్ పాదయాత్ర సందర్భంగా తన వద్దకు వచ్చిన వారి సమస్యలను ఓర్పుగా విన్న వైఎస్‌ జగన్‌ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక పాదయాత్రలో ఉన్న జగన్‌ను ఏపీ సర్వే ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సభ్యులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఏపీ సర్వేశాఖలో మొత్తం 1800 పోస్టులు మాత్రమే ఉన్నాయని ఉద్యోగులు పేర్కొన్నారు. ఏపీ కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →