Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

JaleelKhan

By   /  April 18, 2016  /  Comments Off on JaleelKhan

    Print       Email

jaleelజ‌గ‌న్‌కు జ‌లీల్ స‌వాల్‌!

 

InCorpTaxAct
Suvidha

 

 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ఇటీవ‌లే ఆ పార్టీ నుంచి వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరిన విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ స‌వాల్ విసిరారు. చంద్ర‌బాబు నాయుడుకు ద‌మ్మూ ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించు అని వైసీపీ ఎమ్మెల్యేలు అన‌డం స‌రికాద‌ని,వైయ‌స్ఆర్‌సీపీ ద‌మ్మూ ధైర్యం ఉంటే తాను రాజీనామా చేసి పోటీ సిద్ధ‌మ‌ని, త‌న‌పై పోటీ గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు. అస‌లు త‌న‌పై పోటీ చేయ‌డానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌కు నాయకుడే దొర‌క‌డ‌న్నారు.  వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌కు అస‌లు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లేవ‌ని, ఎమ్మెల్యేల‌ను చాలా చిన్నచూపు చూస్తార‌న్నారు.

చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించ‌గ‌ల స‌త్తా ఉంద‌ని, అందుకే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంలో చేరిన‌ట్లు పేర్కొన్నారు. సాక్షి పేప‌ర్‌ను అడ్డం పెట్టుకుని త‌న‌పై అస‌త్య క‌థ‌నాలు రాయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌న‌ను ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న చేయాల‌ని చూస్తే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. కాగా ఇప్పుడిప్పుడు రాజీనామాల‌కు సిద్ధ‌మ‌ని ఎమ్మెల్యేలు నోరు విప్పుతుండ‌డంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతోంది. మొన్న జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి, నిన్న విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్ రాజీనామాల‌కు సిద్ధ‌మ‌ని బ‌హిరంగ స‌వాల్ విస‌ర‌డంపై వైయ‌స్ఆర్‌సీపీ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. వాళ్లు ఏ ధైర్యంతో రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డుతున్నారో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటోంది. ఏది ఏమైనా ఉప ఎన్నిక‌లు వ‌స్తే మాత్రం ఆ స్థానాల‌ను ఖ‌చ్చితంగా గెలుచుకోవాల‌ని ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →