Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Jammu And Kashmir Political Crisis update..

By   /  March 24, 2016  /  Comments Off on Jammu And Kashmir Political Crisis update..

    Print       Email

mehabooba mufthi 1

జమ్మూకాశ్మీర్‌లో రాజకీయ సంక్షోభానికి తెర..?

InCorpTaxAct
Suvidha

 

 

జమ్మూకాశ్మీర్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడనుందా.? త్వరలో ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ బాధ్యతలు స్వీకరించనున్నారా..? అంటే.. పీడీపీ చీఫ్ మెహబూబా మాటలను బట్టి అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జోరందుకున్నాయి. బీజేపీతో పొత్తుకు సంబంధించి పీడీపీకి సానుకూల సంకేతాలు వచ్చాయి. ప్రధాని మోడీతో భేటి అయిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సుమారు అరగంట పాటు పలు అంశాలపై చర్చలు చేపట్టారు. అనంతరం మోదీతో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లుగా ప్రకటించారు. తర్వాత తమ పార్టీ నేతలతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

అయితే పొత్తులకు సంబంధించి పీడీపీ షరతులకు బీజేపీ అంగీకరించిందా లేదా అన్న విషయాలపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. అయితే గతంలో రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్నే మళ్లీ కొనసాగించేందుకు అంగీకరించినట్టు రాజకీయ వర్గాల సమాచారం. నమ్మకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య నెలకొన్న అగాధం మోడీ వల్ల తొలగిపోయిందని మెహబూబా తెలిపారు.

జమ్మూలో గత రెండున్నర నెలలుగా సర్కారు ఏర్పాటు కాలేదు. దీంతో ఎమ్మెల్యేలలో అసహనం పెరిగిపోయింది. మళ్ళీ ప్రజా ప్రతినిధులు ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడంతో మెహబూబా తన పద్ధతి మార్చుకుని బీజేపీ చెంతన చేరినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →