జమ్మూ – శ్రీనగర్ సొరంగ మార్గం ప్రత్యేకతలు ఇవే..!
భారత్ లోనే అతి పొడవైన సొరంగ మార్గం. అంతే కాదు ఆసియాలోనే అతి పొడవైన రెండు మార్గాల సొరంగా మార్గం. దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం దీన్ని జాతికి అంకితం చేశారు. ఈ మార్గాన్ని జమ్మూ కశ్మీర్ స్టేట్ లోని చెనాన్-నష్రి ప్రధాన రహదారిలో భాగంగా నిర్మించారు. ఇక ఈ సొరంగ మార్గానికి ఉన్న ప్రత్యేక అన్నీ ఇన్నీ కావు.. మరి అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..
ఈ అండర్ గ్రౌండ్ రోడ్ జమ్మూ – శ్రీనగర్ ల మధ్య ఏకంగా రెండు గంటల ప్రయాణాన్ని తగ్గిస్తుంది. 9 కి.మీల పొడవైన ఈ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.3720 కోట్లు ఖర్చు చేసి నిర్మించింది. నిత్యం 27 లక్షల మేర ఫ్యూయల్ ఆదా అవుతుంది. ఆసియాలోనే అతిపెద్ద రెండు మార్గాల సొరంగ మార్గంగా నిలిచింది. ఇందులో భద్రతకు పటిష్టంగా ఏర్పాటు చేశారు. మార్గం పొడవునా 124 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే స్కానర్లు కూడా ఏర్పాటు చేశారు.
మార్గానికి ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఈ మార్గాన్ని కేవలం నాలుగేళ్ళ వ్యవధిలో నిర్మించారు. అన్ని సీజన్లలో ఈ మార్గంలో వాహనదారులు అత్యంత సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు.ఇక వాహనాలను పసిగట్టేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే సహాయక చర్యలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సొరంగ మార్గాల్లో ఇది ఆరవది. కాగా భారత్ లో మాత్రం మొట్టమొదటిదిగా నిలిచింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.