Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

Jana Reddy working with TRS leaders causing conflicts within Congress Party

By   /  August 28, 2016  /  Comments Off on Jana Reddy working with TRS leaders causing conflicts within Congress Party

    Print       Email

jana reddyజానారెడ్డి టీఆర్ఎస్ కోవ‌ర్టా?

 

InCorpTaxAct
Suvidha

 

 

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కె.జానారెడ్డిపై ఆ పార్టీలోని చాలా మంది అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌తో స‌ఖ్య‌త‌గా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. అంతేకాదు ఒకానొక ద‌శ‌లో జానారెడ్డి టీఆర్ఎస్ పార్టీ కోవ‌ర్టా? అని కూడా అన్నారు. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే.. తమ్మిడిహట్టి బ్యారేజి నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పందాలూ జరుగలేదని జానారెడ్డి కుండబద్దలు కొట్టారు. దీంతో కాంగ్రెస్ నేతలు గతకొన్నాళ్లుగా చెప్తున్న ఒప్పందం మాటలు కట్టుకథలేనని తేలిపోయాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తదితర కాంగ్రెస్ నేతలు చేతిలో పేపర్లు పట్టుకొని నిన్నమొన్నటి వరకు చెప్పిందంతా అసత్య ప్రచారమేనని స్పష్టమైంది. మొన్న సీఎల్పీ కార్యాలయంలో జానారెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నపుడు తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి ప్రయత్నించామని మాత్రమే వివరించారు. బరాజ్‌ను 152 అడుగుల ఎత్తులో నిర్మిస్తే బాగుంటుందని మహారాష్ట్రకు చెప్పామని, ఆ మేరకు మహారాష్ట్రను ఒప్పించేందుకు ప్రయత్నం మాత్రమే చేశామని స్పష్టంగా తెలిపారు. ఈ విషయంలో నాటి మహారాష్ట్ర సీఎంకు లేఖ మాత్రమే రాశామన్న జానారెడ్డి.. ఆ రాష్ట్రంతో తమ హయాంలో ఎలాంటి ఒప్పందం కుదురలేదని చెప్పకనే చెప్పారు. తమ ప్రభుత్వం రాసిన లేఖకు స్పందించిన మహారాష్ట్ర సీఎం 152 అడుగుల ఎత్తులో బ్యారేజి నిర్మాణానికి ఒప్పుకొనేది లేదని తిరుగు లేఖ రాశారని కూడా చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇస్తే ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానని మరోసారి ఆయన స్పష్టం చేశారు. తాను మాటకు మాట మాట్లాడి కొట్లాటలు పెట్టుకోదల్చుకోలేదన్నారు. గతాన్ని తవ్వితీస్తూ గందరగోళం చేయడం కాదని, ఇప్పుడేం చేస్తున్నారో చెప్పాలని ముఖ్యమంత్రిని జానారెడ్డి ప్రశ్నించారు. నేను ఉండవచ్చు, లేకపోవచ్చు. రాష్ర్టానికి అన్యాయం జరుగవద్దనేదే మా అభిప్రాయం అని జానారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన అంశాలను నివృత్తి చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలనే కాంగ్రెస్ చెప్పిందిని తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించినవారు ఎవరైనా జైలుకు వెళ్ళాల్సిందేనని, అది ఎవరికైనా వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన నేపథ్యంలో అది తప్పుడు ఒప్పందమంటూ కాంగ్రెస్ నేతలు రెండు మూడు రోజులుగా రాద్ధాంతం చేస్తున్న నేప‌థ్యంలో జానారెడ్డి మాత్రం తమ నేతల మాటల్లోని డొల్లతనాన్ని విస్పష్టంగా బయటపెట్టడంతో ఆ పార్టీ నేతలు అవాక్కవుతున్నారు. ఏదేమైనా జానారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కే కొర‌క‌రానికొయ్య‌గా త‌యార‌య్యార‌న‌డంలోఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →