Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Janareddy becomes CM, says Komatireddy..

By   /  February 23, 2017  /  Comments Off on Janareddy becomes CM, says Komatireddy..

    Print       Email

komatireddyకాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డే సీఎం: కోమటిరెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం అయ్యేది సీఎల్పీ నేత జానారెడ్డి అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. నల్లగొండలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో చాలెంజ్ చేసి మరీ ఎమ్మెల్సీ స్థానాన్ని సాధించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలైమన నేతలు ఉన్నారని అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు.
పార్లమెంట్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పట్టుబట్టడం వల్లే తెలంగాణ కల సాకారం అయిందని చెప్పారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లిన ప్రతీ నాయకుడు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. కోదండరాంను అరెస్ట్ చేసిన తీరును చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికైనా సీఎం అయ్యేది తానేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు చర్చలకు తావిచ్చాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →