`జనసేను`ను రద్దు చేయాలా?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత కొన్నేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ పార్టీని అయితే స్థాపించారు కానీ ఇప్పటి పార్టీ కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో జనసేన అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేనకి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించినప్పటికీ ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇప్పటిదాకా పోటీ చేయకపోవడం… 2014 ఎన్నికల్లోనే పోటీ చేయాల్సిన జనసేన, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ మొహం చేయడంతో ఆ విమర్శలకు బలం చేకూరుతున్నాయి. డబ్బుల్లేవు కాబట్టి పార్టీని నడపలేకపోతున్నట్లు ఓ సందర్భంలో చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. జనసేన అనే పేరుతో ఓ పార్టీ ఉందన్న విషయం మీడియాలో తప్ప, జనంలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పవన్ డబ్బులు సంపాదించుకోవడానికే పార్టీని స్థాపించారంటూ పలు పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు.
కాగా ఇటీవల ఓ బీసీ నాయకుడొకరు జనసేన పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో జనసేన గురించిన చర్చ మీడియా వర్గాలలో జరగడానికి కారణమైంది. అసలు జనసేన అనే ఓ పార్టీ ఇంతవరకు ప్రజల్లోకి వెళ్లకుండా, పోటీ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసినా, కొనసాగించినా వచ్చే లాభం గానీ నష్టంగానీ ఎవరికీ లేదు. అయితే ఆ పార్టీ పేరుతో జనాన్ని 2014 ఎన్నికల్లో పవన్కళ్యాణ్ మభ్యపెట్టారనే విమర్శలో అర్థముంది. ఎన్నికల్లో ‘నేను ప్రశ్నిస్తా’ అని చెప్పిన పవన్కళ్యాణ్, సమస్యలపై ప్రశ్నించకపోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అవన్నీ నిజమే అయినా పార్టీని రద్దు చేసెయ్యాలంటే ఎలా?
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.